కార్ల విషయంలో వినియోగదారుల అభిరుచులు రోజురోజుకు మారుతున్నాయి. వారి ఆసక్తికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్తగా, వినూత్నంగా కార్లను తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తున్నాయి. కానీ వినియోగదారులు కోరుకున్న మోడళ్లను వెంటనే వారికి చేరవేసేందుకు కంపెనీలకు చాలా సమయం పడుతోంది. వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. టయోటా హైక్రాస్ మోడల్ కారు వినియోగదారుడిని చేరేందుకు దాదాపు 18 నెలల సమయం పడుతోంది. మహీంద్రా థార్ ఆర్డబ్ల్యూడీ వాహనం కావాలంటే 74 వారాలు వేచి చూడాల్సిందే. మొత్తంగా 2023 మార్చి నెలలో కార్లను వినియోగదారులకు చేర్చేందుకు కంపెనీలు తీసుకునే సమయం గురించి తెలుసుకుందాం.
టయోటా కారు మోడల్స్‌ను వినియోగదారునికి చేర్చేందుకు పట్టే సమయం:
కారు మోడల్స్ | పట్టే సమయం | |
1 | టయోటా హైక్రాస్ | 18 నెలల వరకు |
2 | మహీంద్రా థార్ | 17 నెలల వరకు |
3 | టయోటా హైరైడర్ | 15 నెలల వరకు |
4 | మహీంద్రా స్కార్పియో | 15 నెలల వరకు |
5 | మహీంద్రా ఎక్స్‌యూవీ 700 | 11 నెలల వరకు |
6 | కియా కేరెన్స్ | 11 నెలల వరకు |
7 | మారుతి బ్రెజ్జా | 10 నెలల వరకు |
8 | కియా సోనెట్ | 9 నెలల వరకు |
9 | హ్యుందాయ్ క్రెటా | 8 నెలల వరకు |
10 | మారుతి గ్రాండ్ విటారా | 6 నెలల వరకు |
మారుతి సుజుకి కారు మోడల్స్‌ను వినియోగదారునికి అందిచేందుకు పట్టే సమయం:
మోడల్ | పట్టే సమయం | |
1 | మారుతి సుజుకి గ్రాండ్ విటారా | 24-26 వారాలు |
2 | మారుతి సుజుకి ఎక్స్ఎల్6 | 24-26 వారాలు |
3 | మారుతి సుజుకి సియాజ్ | 8-10 వారాలు |
4 | మారుతి సుజుకి బాలెనో | 4-6 వారాలు |
5 | మారుతి సుజుకి ఇగ్నిస్ | వెయిటింగ్ లేదు |
టాటా కంపెనీ కార్లను వినియోగదారునికి అందించేందుకు సంస్థ తీసుకుంటున్న సమయం:
మోడల్ | పట్టే సమయం | |
1 | టాటా నెక్సాన్ ఏఎమ్‌టీ | 10-14 వారాలు |
2 | టాటా పంచ్ ఏఎమ్‌టీ | 8-10 వారాలు |
3 | టాటా పంచ్ ఎమ్టీ | 6-8 వారాలు |
4 | టాటా నెక్సాన్ ఎమ్టీ | 8-10 వారాలు |
5 | టాటా సఫారీ | 6-8 వారాలు |
6 | టాటా హారియర్ | 6-8 వారాలు |
7 | టాటా ఆల్ట్రోజ్ | 4-6 వారాలు |
8 | టాటా టైగర్ | 4-6 వారాలు |
9 | టాాటా టియాగో | 4-6 వారాలు |