తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీగా పెరిగిన నిరుద్యోగం.. డిసెంబరులో అత్యధికం! - భారత్​లో నిరుద్యోగం 2022

దేశంలో నిరుద్యోగం మరింత పెరిగిందని వెల్లడైంది. హరియాణాలో ఈ సమస్య అత్యధికంగా ఉందని తెలిసింది.

unemployment in india 2022
నిరుద్యోగం

By

Published : Jan 2, 2023, 5:48 PM IST

దేశంలో 2022లో నిరుద్యోగం రేటు భారీగా పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ-సీఎంఐఈ వెల్లడించింది. దేశంలో డిసెంబరులో నిరుద్యోగిత రేటు 8.3 శాతానికి చేరిందని, 2022లో ఇదే అత్యధికమని తెలిపింది. దేశంలో అత్యధికంగా హరియాణాలో నిరుద్యోగం(2022 డిసెంబరులో 37.4%) ఉందని సీఎంఐఈ ఓ నివేదికలో పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో..

  • రాజస్థాన్​- 28.5 శాతం
  • దిల్లీ- 20.8 శాతం
  • బిహార్- 19.1 శాతం
  • జార్ఖండ్- 18 శాతం

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం

  • నవంబర్‌లో నిరుద్యోగిత రేటు 8 శాతం
  • సెప్టెంబర్‌లో ఇది అత్యల్పంగా 6.43 శాతం
  • ఆగస్టులో 8.28 శాతం. 2022లో రెండో అత్యధిక నిరుద్యోగిత రేటు ఇదే.
  • పట్టణ నిరుద్యోగిత రేటు 10 శాతం
  • గ్రామీణ నిరుద్యోగం 7.5 శాతం

ABOUT THE AUTHOR

...view details