ఉబర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీని వల్ల యూజర్లు ఎలాంటి రుసుం చెల్లించకుండానే క్యాబ్‌లలో ప్రయాణించే అవకాశం కలిగింది. సాంకేతిక లోపాన్ని ఓ భారతీయుడు గుర్తించే వరకు ఉబర్‌కు అసలు ఈ బగ్ గురించి తెలియలేదు. ఓ హ్యాకింగ్ సంస్థ ఫౌండర్ అయిన ప్రకాశ్ అనే వ్యక్తి దీనిపై 2017లోనే ఉబర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. "ఈ బగ్‌ను ఆసరాగా చేసుకొని భారత్, అమెరికాలో అనేకసార్లు ఫ్రీగా ప్రయాణించా. ఉబర్‌లో రైడ్ బుక్ చేసిన తర్వాత పేమెంట్ సమయంలో.. ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే సరిపోతుంది. పేమెంట్ మధ్యలోనే ఆగిపోయి.. రైడ్ బుక్ అయినట్లు చూపిస్తుంది. ఫ్రీగా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. రుజువు కోసం నేను వీడియో కూడా తీశాను. పేమెంట్ మెథడ్‌లో 'abc' లేదా 'xyz' వంటి అక్షరాలు టైప్ చేస్తే చాలు. మన రైడ్‌కు బిల్ రాదు" అని ప్రకాశ్ తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో వివరించారు.
ఇంత పెద్ద సాంకేతిక లోపాన్ని ఉబర్ టీమ్ ఎలా గుర్తించలేకపోయిందనేది ఆశ్చర్యకరంగా మారింది. అయితే, బగ్‌ను గుర్తించి రిపోర్ట్ చేసిన ఎథికల్ హ్యాకర్ ప్రకాశ్‌కు ఆ సంస్థ భారీ నజరానా ప్రకటించింది. ప్రకాశ్‌కు రూ.4.6 లక్షల రివార్డ్ అందించినట్లు తెలుస్తోంది. ఈ బగ్‌ను గుర్తించకపోతే.. చాలా మంది యూజర్లు ఫ్రీగా ఉబర్‌ను వాడుకునేవారు. దీంతో ఆ సంస్థకు నష్టాలు తప్పేవి కావు.