Top 50 Litre Water Geysers :ప్రస్తుతం వింటర్ సీజన్ నడుస్తోంది. ఈ చలికి ఉదయం, రాత్రి పూట బయటికి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఇక చన్నీటి స్నానం పక్కన పెడితే.. కనీసం చల్లటి నీళ్లలో చేతులు పెట్టడం కూడా కష్టంగానే ఉంటుంది. దీంతో వేడి నీటి వినియోగం బాగా పెరిగింది.నీటిని వేడి చేయడానికి ప్రజలు పలు మార్గాలను అనుసరిస్తున్నారు. కొందరు గ్యాస్ ఉపయోగిస్తే.. మరికొందరు వాటర్ హీటర్స్ ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల ఉన్న కొన్ని నష్టాల కారణంగా ఎక్కువ శాతం మంది వాటర్ హీటింగ్ కోసం గీజర్స్ వాడటం మొదలుపెట్టారు. తక్కువ సమయంలో ఈజీగా వేడి నీటి(Hot Water)ని సిద్ధం చేసుకునేందుకు ఇవి బెస్ట్ ఆప్షన్స్. మరి మీరు ఈ చలికాలంలో మంచి గీజర్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం బడ్జెట్ ధరలో 50 లీటర్ల కెపాసిటీ ఉన్న టాప్ 7 వాటర్ గీజర్ల జాబితా పట్టుకొచ్చాం. పైగా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. ఆలస్యమెందుకు ఇప్పుడే వాటిపై ఓ లుక్కేయండి..
1. ACTIVA Storage 50 LTR : 50 లీటర్ల కెపాసిటీ ఉన్న Activa వాటర్ గీజర్ ISI గుర్తింపు పొందింది. ఏడు సెఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. హెవీ-డ్యూటీ 2kva హీటింగ్ ఎలిమెంట్‌తో దీనిని తయారు చేశారు.
స్పెసిఫికేషన్లు..
- కెపాసిటీ : 50 లీటర్లు
- ఎనర్జీ రేటింగ్ : 5 స్టార్స్
- ట్యాంక్ మెటీరియల్ : 0.8mm మందం
- బాడీ : స్పెషల్ యాంటీ-రస్ట్ కోటింగ్ మెటల్ బాడీ
- హీటింగ్ ఎలిమెంట్ : హెచ్డీ ISI ఎలిమెంట్ హాట్‌లైన్/క్రిస్టల్ ఐవరీ
- అదనపు ఫీచర్లు : అడ్జస్టబుల్ ఔటర్ థర్మోస్టాట్, ఉచిత ఇన్‌స్టాలేషన్ కిట్
2. AO Smith HAS-50 Horizontal Water Heater Geyser :బడ్జెట్లో ఉన్న మరో గీజర్ AO స్మిత్ HAS 50. ఇది మన్నిక విషయంలో ఎలాంటి తుప్పు పట్టకుండా గ్లాస్ లైన్ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఈ గీజర్ వైట్ కలర్లో ఉండడం వల్ల మీ బాత్రూమ్ డెకర్లోనూ కలిసిపోతుంది.
స్పెసిఫికేషన్స్..
- కెపాసిటీ : 50 లీటర్లు
- ఓరియెంటేషన్ : హారిజాంటల్
- రంగు : తెలుపు
- బాడీ కన్స్ట్రక్షన్ : మన్నికైన, తుప్పు-నిరోధకత
- ఎనర్జీ ఎఫిషియెన్సీ : హై-రేటెడ్ హీటింగ్ ఎలిమెంట్
- సేఫ్టీ ఫీచర్స్ : మల్టిపుల్ సేఫ్టీ సిస్టమ్స్
3. Venus Water Heater :ఇది చాలా శక్తివంతమైన వాటర్ గీజర్. దీనిలో ఉండే 2000-వాట్ హీటింగ్ ఎలిమెంట్ కేవలం 45 నిమిషాల్లో నీటి ఉష్ణోగ్రతను 35°C పెంచగలదు. పింగాణీ ఎనామెల్ గ్లాస్-లైన్డ్ ట్యాంక్ మన్నికను కలిగి ఉండటం వల్ల తుప్పు పట్టకుండా ఉంటుంది.
స్పెసిఫికేషన్స్..
- కెపాసిటీ : 50 లీటర్లు
- టైప్ : స్టోరేజ్ వాటర్ గీజర్
- అదనపు ఫీచర్లు : ఉష్ణోగ్రత నియంత్రణ నాబ్
- సేఫ్టీ ఫీచర్స్ : హై క్వాలిటీ థర్మోస్టాట్, కటౌట్
4. Longer 50 Litre Storage Water Heater :లాంగర్ వాటర్ హీటర్ హై-టెక్ ఫీచర్లు, మన్నికైన డిజైన్‌ను కలిగి ఉంది. LED సూచికలు పవర్, హీటింగ్ స్థితిని చూడడాన్ని సులభతరం చేస్తాయి.
స్పెసిఫికేషన్‌లు..
- కెపాసిటీ : 50 లీటర్లు
- బాడీ : యాంటీ రస్ట్ కోటింగ్ మెటల్ బాడీ
- హీటింగ్ ఎఫిషియెన్సీ : అధికం
- ఇన్‌స్టాలేషన్ : సులభమైన ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ
- భద్రతా లక్షణాలు : అధునాతన భద్రతా విధానాలు