తెలంగాణ

telangana

ETV Bharat / business

మరో 3 రోజులే గడువు.. ఈ పనులన్నీ పూర్తి చేస్తే మీకే మేలు!

మార్చి 31తో 2022-23 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. మరో మూడు రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కొన్ని పనులు పూర్తిచేస్తే.. మీరు పన్ను ప్రయోజనాలు పొందచ్చు. అదే విధంగా మినహాయింపులు సైతం తీసుకోవచ్చు. కొన్ని పెనాల్టీలను తప్పించుకోవచ్చు.

tax-rules-to-end-on-march-31-in-india-and-also-tax-benefits-tax-exemption
భారత్​లో పన్ను ప్రయోజనాలు

By

Published : Mar 28, 2023, 5:27 PM IST

మార్చి నెల ఆర్థిక సంవత్సరం ముగింపు నెల. ఈ నెల మొత్తం ఖాతాల ముగింపు లెక్కలతో బిజీ, బిజీగా ఉంటుంది. అంతే కాకుండా మార్చి నెల 31 పన్ను చెల్లింపుదారులకు చాలా ముఖ్యమైనది రోజు. ఎటువంటి పెనాల్టీలు లేకుండా ఉండాలంటే పన్ను చెల్లింపుదారులు.. గడువులోగా పన్నులన్నీ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఆదాయ పన్ను నిపుణులు కొన్ని పనులు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. మార్చి 31 లోగా వీటిని విధిగా చేయాలని చెబుతున్నారు.

ప్రతి పన్ను చెల్లింపుదారుడు, కంపెనీలు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పన్ను ప్రయోజనాలను క్లెయిమ్​ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై పన్ను చెల్లింపుదారులు కాస్త అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వం నుంచి పన్ను ప్రయోజనాలు, మినహాయింపు పొంది పెనాల్టీలు లేకుండా పన్ను చెల్లించాలంటే ఈ ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి.

1. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ముందస్తు పన్ను చెల్లింపు గడువు 2023 మార్చి 31 తో ముగుస్తుంది. 2023 ఏప్రిల్ 1, 2023 నుంచి.. ముందస్తు పన్ను చెల్లించని వారు సెక్షన్ 234B కింద వడ్డీతో కట్టాల్సి ఉంటుంది. సెక్షన్ 234B కింద.. ముందస్తు పన్ను చెల్లింపుల్లో డిఫాల్ట్‌గా వడ్డీ చెల్లింపు జరుగుతుంది. సాధారణంగా డిఫాల్ట్ వడ్డీ.. నెలకు 1% లేదంటే నెలలో కొంత భాగం ఉంటుంది.

2. సెక్షన్ 80 ఈఈబీ కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణాలపై వడ్డీ ప్రయోజనాన్ని పొందేందుకు చివరి తేదీ 2023 మార్చి 31. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 ఈఈబీ కింద ఎలక్ట్రానికి వాహనాలను కొనుగోలు చేసినందుకు గాను వడ్డీ చెల్లింపులపై రూ.1.5 లక్షల తగ్గింపును పొందవచ్చు. ఈ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు, వ్యాపార అవసరాలకు కొన్న ఈ సెక్షన్​ కింద మినహాయింపులు వర్తిస్తాయి. ఈ పన్ను ప్రయోజనాలకు గడువు 2023 మార్చి 31తో ముగుస్తుంది.

3. ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి.. పన్ను ఆదా పెట్టుబడులకు గడువు కూడా 2023 మార్చి 31తో ముగుస్తుంది. పన్ను ఆదా చేసుకునేందుకు వీలైనంత త్వరగా ఈ పెట్టుబడులు పెట్టడం మంచిది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులు.. 2023 మార్చి 31 లోపు తమ పన్ను ఆదా పెట్టుబడులను పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం తర్వాత ఏవైనా పెట్టుబడులు పెడితే.. ఆదాయ పన్ను రిటర్న్​లు ఫైల్ చేసేటప్పుడు పాత పన్ను నిబంధనలలో తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండదు.

4. పన్ను చెల్లింపుదారులు.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి(అసెస్మెంట్ ఇయర్​) సంబంధించి.. అప్​డేట్​ చేసిన ఆదాయ పన్ను రిటర్నులు 2023 మార్చి 31 లోపు ఫైల్ చేయాలి. 2022 బడ్జెట్​ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను రిటర్న్​లను అప్​డేట్​ చేసుకోవడానికి కొత్తంగా 'ITR-U' ను ప్రారంభించింది. ఇందులోను పన్ను చెల్లిపుదారుడు ఆదాయ పన్ను రిటర్న్​ ఫైల్​ చేయడానికి, వాటిని అప్​డేట్​ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా సంబంధిత అసెస్మెంట్​ ఇయర్​ నుంచి రెండు సంవత్సరాల వరకు ఆదాయ పన్ను రిటర్న్​లో లోపాలను సరిచేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇక్కడ పన్ను చెల్లింపుదారుడు ప్రతి అసెస్‌మెంట్ ఇయర్​ రిటర్న్‌ను మాత్రమే ఫైల్ చేయవచ్చు.

5. పాన్​ కార్డ్​ను, ఆధార్​ కార్డ్​ను 2023 మార్చి 31 లోపు లింక్​ చేసుకోవాలని తొలుత కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఈ గడువును జూన్​ 30వ తేదీ వరకు పొడిగిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆదాయ పన్ను చట్టం.. సెక్షన్ 139AA ప్రకారం ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పర్మనెంట్​ అకౌంట్​ నంబర్​(పాన్​) ఇస్తుంది. 2017 జులై 1 నుంచి పాన్​ తీసుకున్న వారు, ఆధార్​ కార్డ్​ కలిగి ఉన్నవారు కచ్చితంగా రెండింటినీ లింక్​ చేసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details