తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్​ 1000 ప్లస్​

Stock markets
భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : May 30, 2022, 9:27 AM IST

Updated : May 30, 2022, 3:44 PM IST

15:41 May 30

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, చైనాలో కొవిడ్​ ఆంక్షల సడలింపునకు తోడు కీలక రంగాలు రాణించటం వల్ల దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా మూడో సెషన్​లోనూ లాభాలతో ముగిశాయి. 600 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైన సూచీలు.. అదే జోరును కనబరిచాయి. సెన్సెక్స్​ ఒకానొక దశలో 1100 పాయింట్ల మార్క్​ను దాటి చివరకు 1042 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 300కుపైగా లాభపడింది.

  • ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1042 పాయింట్ల వృద్ధితో 55,925 వద్ద ముగిసింది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి నిఫ్టీ 309 పాయింట్ల లాభంతో 16,661 వద్ద కదలాడుతోంది.

లాభనష్టాల్లోనివి..
టైటాన్​ కంపెనీ, ఎంఅండ్​ఎం, అదానీ పోర్ట్స్​, ఇన్ఫోసిస్​లు 4శాతానికిపైగా లాభపడ్డాయి. మరోవైపు.. కొటక్​మహీంద్ర, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, సన్​ ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, ఐటీసీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:38 May 30

దేశీయ స్టాక్​ మార్కెట్లో బుల్​ జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించిన సూచీలు.. అదే జోరులో కొనసాగుతున్నాయి. ఒకానొక దశలో సెన్సెక్స్​ 1100 పాయింట్లకుపైగా స్థాయిని తాకింది. ప్రస్తుతం కాస్త వెనక్కి తగ్గి 950 పాయింట్లకుపైగా వృద్ధితో కొనసాగుతోంది.

  • ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 955 పాయింట్ల వృద్ధితో 55,840 వద్ద ట్రేడవుతోంది
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి నిఫ్టీ 281 పాయింట్ల లాభంతో 16,633 వద్ద కదలాడుతోంది.

11:48 May 30

దేశీయ సూచీలు వరుసగా మూడో సెషన్​లోనూ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనాలో కరోనా ఆంక్షల సడలింపుతో అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల ధోరణి, అమెరికా ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపును వాయిదా వేస్తారన్న వార్తలతో బుల్​ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్​ 1150లకుపైగా పాయింట్ల మేర వృద్ధితో కొనసాగుతుండగా.. 16,650పైగా పాయింట్లతో నిఫ్టీ ట్రేడవుతోంది.

  • ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1153 పాయింట్ల వృద్ధితో 56,037 వద్ద కొనసాగుతోంది
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 330 పాయింట్ల లాభంతో 16,683 వద్ద ట్రేడవుతోంది.

కారణాలు: చైనాలోని షాంఘై, బీజింగ్​ వంటి నగరాల్లో కరోనా ఆంక్షలు సడలించిన క్రమంలో ఆసియా మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. మరోవైపు.. అమెరికా ఫెడరల్​ రిజర్వ్​ మానిటరీ పాలసీ సమావేశంలోని వివరాలను గత బుధవారం విడుదల చేశారు. దాంతో వడ్డీ రేట్ల పెంపునకు తాత్కాలికంగా బ్రేక్​ వేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇది మదుపరులపై సానుకూల ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

09:25 May 30

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్​ 1000 ప్లస్​

అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల పవనాలకు తోడు కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 820 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 16,500 పైన ట్రేడవుతోంది.

  • ముంబయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 820 పాయింట్ల లాభంతో 55,704 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 237 పాయింట్ల వృద్ధితో 16,589 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..
ఇన్ఫోసిస్​, ఎంఅండ్​ఎం, టాటా మోటార్స్​, అదానీ పోర్ట్స్​, విప్రోలు సుమారు 2 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఎన్​టీపీసీ, కొటక్​ మహీంద్రాలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : May 30, 2022, 3:44 PM IST

ABOUT THE AUTHOR

...view details