గత రెండు రోజులుగా డీలా పడిన స్టాక్‌మార్కెట్లు వారాంతంలో జోరును ప్రదర్శిస్తున్నాయి. 1000 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇప్పుడు మరో 300 పాయింట్లు ఎగబాకింది. 1304 పాయింట్ల లాభంతో 54,096 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ.. 392 పాయింట్ల లాభంతో 16,202కు చేరింది.
మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన సూచీలు లాభాలను నమోదు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఈ సూచీల్లో 3 శాతం పెరుగుదల నమోదైంది. డాక్టర్ రెడ్డీస్, నెస్లే, టాటా మోటార్స్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.