Stock Market Today 5th December 2023 :దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఆరో రోజు కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 69,035 వద్ద ఆల్‌టైమ్ హై రికార్డ్‌ను నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 52 పాయింట్లు వృద్ధి చెంది 20,739 వద్ద నూతన గరిష్ఠాలను తాకింది. దీని తరువాత కూడా బుల్ రన్ మరింత జోరుగా కొనసాగుతూ ఉంది.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడం, దేశీయంగా స్థూల ఆర్థిక వృద్ధి అంచనాలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వృద్ధి చెందడం మొదలైన అంశాలు మదుపరుల సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. దీనితో వరుసగా 6వ రోజు కూడా దేశీయ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 199 పాయింట్లు లాభపడి 69,064 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 69 పాయింట్లు వృద్ధి చెంది 20,756 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఎమ్ అండ్ ఎమ్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, ఐటీసీ
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు!
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా మార్కెట్లకు బూస్ట్ ఇచ్చిందని నిపుణులు అభిప్రాయపడతున్నారు.