Special FD Schemes With High Interest Rates In 2023 :బ్యాంకులు.. సీనియర్ సిటిజన్లకు, సాధారణ పౌరులకు మంచి వడ్డీ రేటుతో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తుంటాయి. వాటిలో ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన్ బ్యాంక్ స్కీమ్‌లు కూడా ఉన్నాయి. అవి:
- ఎస్బీఐ అమృత్ కలశ్ ఎఫ్డీ స్కీమ్ (400 రోజులు)
- ఐడీబీఐ ఉత్సవ్ ఎఫ్డీ స్కీమ్ (375 రోజులు & 444 రోజులు)
- ఇండియన్ బ్యాంక్ ఇండ్ సూపర్ ఎఫ్డీ స్కీమ్ (400 రోజులు)
ఈ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్‌లో చేరేందుకు ఉన్న గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. అందుకే వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
SBI Amrit Kalash FD Scheme : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)'అమృత్ కలశ్' పేరుతో స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఈ స్కీమ్ కాలవ్యవధి 400 రోజులు. దీని గడువు ఈ డిసెంబర్ 31తో ముగియనుంది.
ఈ స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌లో గరిష్ఠంగా 7.10% వరకు వడ్డీ రేటు ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్లకు, స్టాఫ్‌కు, స్టాఫ్ పెన్షనర్లకు 7.6 శాతం వరకు వడ్డీ ఇవ్వడం జరుగుతుంది.
IDBI Utsav FD Scheme : ఐడీబీఐ బ్యాంక్ ఫెస్టివ్ ఆఫర్ కింద 'ఉత్సవ్ ఫిక్స్డ్ డిపాజిట్' స్కీమ్‌ను అందిస్తోంది. ఈ పథకంలో చేరడానికి ఆఖరి తేదీ 2023 డిసెంబర్ 31. ఐడీబీఐ ఈ స్పెషల్ ఫిక్స్డ్ స్కీమ్‌ను 375 రోజులు, 444 రోజుల కాలవ్యవధిలతో అందిస్తోంది.
- ఐడీబీఐ 375 రోజుల ఉత్సవ్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులకు/ ఎన్ఆర్ఈ/ ఎన్ఆర్ఓలకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీని ఇస్తోంది.
- ఐడీబీఐ 444 రోజుల ఉత్సవ్ ఎఫ్డీ స్కీమ్ ద్వారా సాధారణ పౌరులకు/ ఎన్ఆర్ఈ/ ఎన్ఆర్ఓలకు 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీని ఇస్తోంది.
Indian Bank IND Super 400 Days :
ఇండియన్ బ్యాంక్ 'ఇండ్ సూపర్ 400 డేస్' పేరుతో స్పెషల్ టెర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. 400 రోజుల కాలవ్యవధి గల ఈ డిపాజిట్ స్కీమ్‌లో.. కనిష్ఠంగా రూ.10 వేలు నుంచి గరిష్ఠంగా రూ.2 కోట్లు వరకు పొదుపు చేయవచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తారు. సూపర్ సీనియర్లకు ఏకంగా 8 శాతం వరకు వడ్డీ అందిస్తారు.
టాటా కార్ కొనాలా? 2024లో లాంఛ్ కానున్న 5 బెస్ట్ మోడల్స్ ఇవే!
మహిళలకు గుడ్‌న్యూస్- ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.కోటి ఇన్సూరెన్స్ కవరేజ్!