Small Saving Scheme Interest Rate : చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేటును 30 బేసిస్ పాయింట్లు పెంచింది.
గత కొంతకాలం నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించిన కేంద్రం.. తాజాగా అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 30 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిలో పెట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పోస్టాఫీసుల్లో మూడేళ్ల కాలవ్యవధిలో డిపాజిట్లకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో 30 బేసిస్ పాయింట్లు పెరిగి 5.5 శాతం నుంచి 5.8 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు 7.4 నుంచి 20 బేసిస్ పాయింట్లు పెరిగి 7.6గా ఉంది.
మే నుంచి రిజర్వ్ బ్యాంకు.. కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను 140 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా పెంచుతున్నాయి.