Life cover calculation : దురదృష్టవశాత్తు ఒక కుటుంబ యజమాని మరణించినప్పుడు, అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ. మరి ఈ బీమా పాలసీ ఎంత ఉండాలి? అనేది చాలా మందికి తలెత్తే ఒక కీలకమైన సందేహం.
బీమా కవరేజ్ ఎంత ఉండాలి?
How much life cover is enough : చాలా మందికి తమకు ఎంత మేరకు బీమా పాలసీ అవసరమో తెలియదు. నిజానికి బాగా చదువుకున్నవారికి కూడా ఈ విషయంపై పెద్దగా అవగాహన ఉండడం లేదంటే, ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే బీమా కవరేజ్ ఎంత ఉండాలి? దానిని ఎలా లెక్కించాలి? అనే విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం.
How to calculate premium for life insurance : బీమాను లెక్కించడంలో వయస్సు చాలా కీలకం. ఉదాహరణకు ఒక వ్యక్తి వయస్సు 30 ఏళ్లులోపు ఉంటే.. అతని వార్షిక ఆదాయానికి కనీసం 20 నుంచి 25 రెట్లు జీవిత బీమా ఉండాలి. ఎందుకంటే, కాలం గడుస్తున్న కొద్దీ.. కుటుంబ జీవనశైలి, అవసరాలు క్రమేణా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల అనుకోని పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ మాత్రం జీవిత బీమా ఉండి తీరాలి.
ఒక వ్యక్తి వయస్సు 40 ఏళ్లలోపు ఉంటే.. అప్పుడు అతని బీమా మొత్తం వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు వరకు ఉండాలి. మరీ సింపుల్గా చెప్పాలంటే.. నేటి కాలంలో కనీసం ఒక కోటి రూపాయల వరకు జీవితబీమా పాలసీ తీసుకోవాలి.
కుటుంబ భారం మొత్తం ఒక్కరిపైనే ఉన్నప్పుడు.. పదవీ విరమణ వయస్సు వరకూ.. కుటుంబ ఖర్చులకు, అప్పులకు సరిపోయేలా జీవిత బీమా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అనుకోని దురదృష్టకర పరిస్థితుల్లో కుటుంబ యజమాని మరణిస్తే.. ఆ కుటుంబం ఎలాంటి ఆర్థిక ఒడుదొడుకులకు లోనుకాకుండా ఉంటుంది.
కోటి రూపాయల పాలసీ సరిపోతుందా?
How much life cover is enough for a family : వాస్తవానికి నేటి కాలంలో ఒక కోటి రూపాయల బీమా పాలసీ ఉన్నంత మాత్రాన అది అన్నింటికీ సరిపోతుందని మాత్రం చెప్పలేము. ఎందుకంటే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అప్పులు, కుటుంబ అవసరాలు, విద్య, వైద్యం ఖర్చులు ఇవన్నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు వీటి గురించి కూడా చర్చిద్దాం.