తెలంగాణ

telangana

ETV Bharat / business

SBI WeCare Vs SBI Amrit Kalash : ఎస్​బీఐ వీకేర్​ Vs అమృత్​ కలశ్​.. ఏది బెస్ట్ ఆప్షన్​? - latest business news in telugu

SBI WeCare Vs SBI Amrit Kalash : ఎస్​బీఐ తమ కస్టమర్ల కోసం రెండు స్పెషల్​ టెర్మ్​ డిపాజిట్​ స్కీమ్​లను అందిస్తోంది. అవి ఎస్​బీఐ వీకేర్​, ఎస్​బీఐ అమృత్​ కలశ్​. వీటిపై మంచి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కూడా అందిస్తోంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్​ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

SBI Special term fixed deposits
SBI WeCare Vs SBI Amrit Kalash

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 12:40 PM IST

SBI WeCare Vs SBI Amrit Kalash :భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ ఫిక్స్​డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది. దీనితో పాటు ఎఫ్​డీలపై వివిధ రకాల ఆకర్షణీయమైన ఫీచర్లు, ప్రయోజనాలను కల్పిస్తోంది. స్టేట్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్​డ్ టెర్మ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7.10 శాతం వరకు వార్షిక వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్​ ఎఫ్​డీలపై 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వార్షిక వడ్డీ రేట్లు ఇస్తోంది.

ఎస్​బీఐ స్పెషల్​ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్స్​
SBI Special Term Fixed Deposit Schemes :ఎస్​బీఐ సాధారణ డిపాజిటర్ల కోసం, అలాగే సీనియర్ సిటిజన్స్​ కోసం రెండు అద్భుతమైన లిమిటెడ్​ డ్యూరేషన్​ స్కీమ్​లను అందిస్తోంది. అవి:

  1. ఎస్​బీఐ అమృత్ కలశ్​ పథకం
  2. ఎస్​బీఐ వీకేర్​ పథకం

SBI WeCare Senior Citizen FD Scheme :
ఎస్​బీఐ సీనియర్ సిటిజెన్స్ కోసం ఈ ప్రత్యేకమైన ఫిక్స్​డ్​ డిపాజిట్ పథకాన్ని రూపొందించింది. 5 సంవత్సరాల కనీస కాలవ్యవధితో ఈ పథకాన్ని అందిస్తోంది. ఈ ఎస్​బీఐ వీకేర్​ స్కీమ్​లో మదుపు చేసిన సీనియర్ సిటిజన్​లకు 50 బేసిస్ పాయింట్స్ (bps) ప్రీమియం లభిస్తుంది. దీనితో పాటు మరో 50 బేసిస్​ పాయింట్స్​ కూడా అదనంగా లభిస్తాయి. అంటే ఎస్​బీఐ వీకేర్ పథకంలో చేసిన సీనియర్ సిటిజన్స్​ ఏకంగా 100 బేసిస్​ పాయింట్లు మేర అధిక వడ్డీ రేటును పొందుతారు. ఇది ఇతర సాధారణ ఎఫ్​డీ పథకాలకు ఇచ్చే వడ్డీ రేటు కన్నా చాలా అధికం కావడం గమనార్హం.

ఆఖరు తేదీ!
SBI WeCare FD Scheme Last Date: ఎస్​బీఐ వీకేర్​ పథకంలో చేరేందుకు ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్​ 30. ప్రస్తుతం ఎస్​బీఐ ఈ పథకంలో చేరిన వారికి 7.50 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. మొబైల్ బ్యాంకింగ్, ఆన్​లైన్​ బ్యాంకింగ్ యాప్స్​ ద్వారా కూడా ఈ పథకంలో సులభంగా చేరవచ్చు. లేదా నేరుగా ఎస్​బీఐ బ్రాంచ్​కు వెళ్లి కూడా వీకేర్ పథకాన్ని సబ్​స్క్రైబ్ చేయవచ్చు. ఈ పథకం కింద కొత్త డిపాజిట్​ ఖాతాలు తెరవడమే కాదు. ఇప్పటికే మెచ్యూర్ అయిన డిపాజిట్లను కూడా రెన్యూవల్​ చేసుకోవచ్చు.

లోన్​ సౌకర్యం కూడా!
SBI WeCare Benefits :ఎస్​బీఐ వీకేర్​ పథకంలో మదుపు చేసినవారికి లోన్ సౌకర్యం కూడా కల్పిస్తారు. మీరు ఎంచుకున్న టెర్మ్​ ప్లాన్​ను అనుసరించి, ప్రతీ నెలా లేదా ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీని చెల్లిస్తారు. అదే మీరు ఎస్​బీఐ వీకేర్​ స్పెషల్​ టెర్మ్ డిపాజిట్ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ పీరియడ్​ అయిపోయిన తరువాత ఒకేసారి అసలు, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం సొమ్మును అందజేస్తారు.

ఎస్​బీఐ అమృత్ కలశ్​ పథకం
SBI Amrit Kalash Scheme : ఎస్​బీఐ ఈ స్పెషల్​ టెర్మ్​ డిపాజిట్​ స్కీమ్​ను భారతదేశంలో ఉంటున్న ప్రజలకు, అలాగే ఎన్​ఆర్​ఐలకు కూడా ఈ అందిస్తోంది. ఈ పాలసీ టెర్మ్ కేవలం 400 రోజులు. ఈ స్పెషల్​ ఎఫ్​డీ పథకం కింద సాధారణ డిపాజిటర్లకు 7.1 శాతం వడ్డీ రేటు, సీనియర్​ సిటిజన్​లకు 7.6 శాతం చొప్పున వడ్డీ రేట్లు అందిస్తోంది.

ఎలా అప్లై చేయాలి!
SBI Amrit Kalash Apply Online : నేరుగా ఎస్​బీఐ బ్యాంకుకు వెళ్లి ఈ అమృత్​ కలశ్​ స్కీమ్​లో చేరవచ్చు. లేదా ఆన్​లైన్​ బ్యాంకింగ్​ లేదా ఎస్​బీఐ యోనో యాప్​ ద్వారా కూడా ఈ పథకాన్ని సబ్​స్క్రైబ్​ చేసుకోవచ్చు. ఈ స్కీమ్​లో చేరడానికి ఆఖరు తేదీ 2023 డిసెంబర్​ 31.

లోన్​ సౌకర్యం కూడా!
SBI Amrit Kalash Scheme Benefits :ఎస్​బీఐ అమృత్​ కలశ్​ స్కీమ్​లో చేరిన వారికి రుణ సౌకర్యం కూడా కల్పిస్తారు. మీరు ఎంచుకున్న ఆప్షన్​ను అనుసరించి ప్రతి నెలా లేదా ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ అందిస్తారు. అమృత్​ కలశ్​ స్పెషల్​ టెర్మ్ డిపాజిట్​ స్కీమ్​లో చేరిన వారికి మెచ్యూరిటీ పీరియడ్​ పూర్తి అయిన తరువాత అసలు, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం కలిపి ఒకేసారి అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details