SBI Standalone Net Profit : భారతదేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఈ ఏడాది భారీ లాభాలను నమోదు చేసింది. 2023 జూన్ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో రూ.16,884 కోట్ల స్టాండ్అలోన్ నెట్ ప్రాఫిట్‌ను సంపాదించింది. ఇది గతేడాదితో పోల్చితే రెండు రెట్లు లాభం కావడం విశేషం. 2022-23 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ స్టాండ్అలోన్ నెట్ ప్రాఫిట్ కేవలం రూ.6,068 మాత్రమే. వాస్తవానికి మొండి బాకాయిలు తగ్గుముఖం పట్టడం, రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయం మెరుగుపడడమే ఎస్బీఐ లాభాలకు కారణం.
లాభాలు రెట్టింపు!
SBI Consolidated Profit : ఎస్బీఐ ఏకీకృత లాభం కూడా దాదాపు రెండు రెట్లు పెరిగింది. గతేడాది ఏప్రిల్-జూన్ మాసాల్లో ఎస్బీఐ కన్సాలిడేటెడ్ ప్రోఫిట్ రూ.7,325 కోట్లు ఉండగా, ఈ సంవత్సరం అది రూ.18,537 కోట్లకు పెరిగింది. తాజాగా ఎస్బీఐ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఎస్బీఐ మొత్తం లాభం
SBI Total Income : 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం ఆదాయం రూ.74,989 కోట్లు, కానీ ఈ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ మొత్తం ఆదాయం ఏకంగా రూ.1,08,039 కోట్లకు చేరింది.