తెలంగాణ

telangana

ETV Bharat / business

లోన్​ తీసుకునే వారికి గుడ్​న్యూస్​-దీపావళి సందర్భంగా బ్యాంకుల బంపరాఫర్​! - పంజాబ్ నేషనల్ బ్యాంక్

Three Banks Diwali Offers on Home and Car Loans: మీరు హోమ్ లోన్, కారు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే, మీకో గుడ్​న్యూస్​. ఈ దీపావళి పండుగను పురస్కరించుకుని మూడు ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్, కారు లోన్స్ అందిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 11:37 AM IST

Three Banks Diwali Offers on Home and Car Loans: పండుగ సీజన్​ సందర్భంగా బ్యాంకులు వరుసపెట్టి ఆఫర్లు అందిస్తున్నాయి. లోన్ పొందాలని భావించే వారికి ఇది అదిరే శుభవార్త అని చెప్పుకోవచ్చు. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారు, అలాగే కొత్తగా కారు కొనాలనే ప్లానింగ్‌లో ఉన్న వారు ఈ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. దేశంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) దీపావళి ఆఫర్లు అందిస్తున్నాయి. మరి ఆఫర్లు ఏంటి..? ఎంత వడ్డీతో ఆఫర్లు అందిస్తున్నాయి..? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

RBI New Rules on Home Loans Save Big: ఇంటి కోసం బ్యాంకు లోన్​ తీసుకున్నారా..? లక్షల రూపాయలు ఆదా చేసుకోండిలా!

ఎస్‌బీఐలో హోమ్ లోన్, కారు లోన్ల ఆఫర్స్:

SBI Diwali Offers on Home and Car Loans

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తక్కువ వడ్డీకే హోమ్ లోన్స్, కారు లోన్స్ అందిస్తోంది.
  • స్పెషల్ ఆఫర్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 1న ప్రారంభించింది. డిసెంబర్ 31, 2023 వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది.
  • ఈ స్పెషల్ ఆఫర్ ద్వారా ఎస్‌బీఐ కస్టమర్లు టర్మ్ లోన్ వడ్డీ రేట్లలో భారీ తగ్గింపు పొందవచ్చు. ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే 65 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు అందిస్తోంది.
  • ఉదాహరణకు సిబిల్ స్కోర్ 700 నుంచి 749 మధ్య ఉంటే వడ్డీ రేటు 8.7 శాతంగానే ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉంటే 9.35 శాతంగా ఉంటుంది. అలాగే సిబిల్ స్కోర్ 750 నుంచి 799గా ఉంటే వడ్డీ రేటు 8.6 శాతానికి తగ్గుతుంది.
  • మరోవైపు.. హోమ్ లోన్ టేకోవర్ రీసేల్ ఫ్లాట్ లేదా రెడీటూ మూవ్ ప్రాపర్టీలపై 20 బేసిస్ పాయింట్ల రాయితీ ఇస్తోంది. అయితే సిబిల్ స్కోర్ 700 ఆపైన ఉండాల్సి ఉంటుంది.

Home Loans With Low Interest Rates 2023 : తక్కువ వడ్డీకి.. హోమ్ లోన్స్​ అందించే బ్యాంకులివే..!

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) హోమ్ లోన్, కారు లోన్ల ఆఫర్స్:

PNB Diwali Offers on Home and Car Loans

  • ఈ దీపావళి సందర్భంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 'దీపావళి ధమాకా- 2023' పేరుతో కొత్త ఆఫర్ ప్రకటించింది.
  • దివాళీ 2023కి షాపింగ్ ట్రెండ్‌ను ఒడిసి పెట్టే లక్ష్యంగా ఈ ఆఫర్ తీసుకొచ్చింది.
  • ఈ ఆఫర్ కింద పీఎన్‌బీ కస్టమర్ల తక్కువ వడ్డీకే హోమ్ లోన్ తీసుకోవచ్చు. గృహ రుణాలపై వార్షిక వడ్డీ 8.4 శాతానికే అందిస్తోంది.
  • మరోవైపు.. కారు లోన్స్ సైతం తగ్గించిన వడ్డీ రేట్లకే అందిస్తోంది. ప్రస్తుతం కారు లోన్లు 8.75 శాతం వడ్డీకే ఇస్తోంది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేసింది.
  • హోమ్ లోన్లపైనా ప్రాసెసింగ్ ఫీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవని తెలిపింది.
  • అంతే కాకుండా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు https://digihome.pnb.co.in/pnb/hl/ వెబ్ సైట్ ద్వారా చేసుకోవచ్చని తెలిపింది.
  • అలాగే కారు లోన్ల కోసం PNB ONE యాప్​ లేదా బ్యాంక్ వెబ్‌సైట్(https://www.pnbindia.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
  • అదనపు సమాచారం కోసం కస్టమర్లు టోల్​ ఫ్రీ నెంబర్​ 1800 1800/1800 2021 కాల్​ చేసి వివరాలను తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.

Personal Loan Problems: పర్సనల్​ లోన్ తీసుకోవటం మంచిదేనా..? సమస్యలేంటి..?

బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్, కారు లోన్ ఆఫర్స్:

Bank of Baroda Diwali Offers on Home and Car Loans

  • బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం ప్రత్యేక ఫెస్టివల్ క్యాంపెయిన్ 'ఫీలింగ్ ఆఫ్ ఫెస్టివల్ విత్ BoB' నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ 31, 2023 వరకు కొనసాగుతుందని బ్యాంక్ తెలిపింది.
  • ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గింపుతో 8.4 శాతంగా నిర్ణయించినట్లు తెలిపింది. అలాగే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ వసూలు చేయబోమని తెలిపింది.
  • అలాగే కారు లోన్లు 8.7 శాతం వడ్డీ రేటు నుంచి ప్రారంభమవుతున్నాయని తెలిపింది.
  • కారు లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లపై బీఓబీ కస్టమర్లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంక్ ప్రకటించింది.

ఫస్ట్​ టైం 'హోం లోన్' తీసుకుంటున్నారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

Car Loan Tips : కారు 'లోన్​' తీసుకోవాలా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రాబ్లమ్​ లేకుండా..​!

Credit score myths : క్రెడిట్​ స్కోర్​పై ఉన్న అపోహలు - వాస్తవాలు మీకు తెలుసా?

For All Latest Updates

TAGGED:

car loans

ABOUT THE AUTHOR

...view details