Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!
Post Office Schemes Interest Rates In Telugu : మీరు పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మదుపు చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. భారత తపాలా శాఖ 8 రకాల డిపాజిట్ స్కీమ్‌లను అందిస్తోంది. వీటిలో PPF, SSY, NSC, SCSS లాంటి పథకాలు కూడా ఉన్నాయి. ఇండియన్ పోస్ట్ ఈ పథకాలపై 6.5 శాతం నుంచి 8.2 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Post Office Schemes Interest Rates
By
Published : Aug 21, 2023, 5:51 PM IST
|
Updated : Aug 21, 2023, 7:50 PM IST
Post Office Schemes Interest Rates :ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ అవసరాల కోసం పొదుపు, మదుపు చేయాలనుకుంటారు. ముఖ్యంగా తాము కష్టపడి సంపాదించిన డబ్బులు పదిలంగా ఉంటూనే, వాటిపై రాబడి రావాలని ఆశిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమే భారత తపాలా శాఖ అనేక పొదుపు పథకాలను అమలు చేస్తోంది. వాటిపై మంచి వడ్డీ రేట్లను కూడా అందిస్తోంది. మరి అవేంటో మనమూ చూద్దామా?
భారత తపాలా శాఖ మదుపరుల కోసం 8 రకాల డిపాజిట్ పథకాలను అందిస్తోంది. వీటినే మనం సాధారణంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ అంటూ ఉంటాం. వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (5 ఇయర్స్ టెర్మ్ పాలసీ) ఉన్నాయి. ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికంలో నోటిఫై చేస్తూ ఉంటారు.
2023 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలోని వడ్డీ రేట్లు...
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వడ్డీ రేట్లు : PPF Interest Rates : ప్రజా భవిష్యత్ నిధి అనేది దీర్ఘకాలిక పొదుపు పథకం. దీని మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లు. దీనిపై ఎలాంటి పన్నులు విధించరు. సంవత్సరానికి రూ.500 కనీస మొత్తంతో ఈ పొదుపు పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం తపాలాశాఖ పీపీఎఫ్ పథకాలపై 7.1 శాతం వరకు వడ్డీ అందిస్తోంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు : SCSS Latest Interest Rates : 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో మదుపు చేసుకోవచ్చు. గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. దీని వల్ల వృద్ధాప్యంలో వాళ్లకు క్రమం తప్పకుండా వడ్డీ రూపంలో ఆదాయం చేకూరుతుంది. ప్రస్తుతం తపాలా శాఖ ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్‌పై 8.2 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
సుకన్య సమృద్ధి యోజన (SSY) వడ్డీ రేట్లు SSY Latest Interest Rates : కేంద్ర ప్రభుత్వం బాలికల బంగారు భవిష్యత్ కోసం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంపై 8 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది ఇండియన్ పోస్ట్.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వడ్డీ రేట్లు NSC Interest Rates : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్‌పై 5 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. తపాలా శాఖ ఈ పథకంపై 7.7 శాతం వడ్డీ రేటు అందిస్తోంది.
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్ (MIS) వడ్డీ రేట్లు MIS Interest Rates : ఈ ఎంఐఎస్ స్కీమ్ పథకంలో మదుపు చేసిన వారికి నెలనెలా వడ్డీ రూపంలో ఆదాయం అందుతుంది. ప్రస్తుతం ఇండియన్ పోస్టు ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ రేటును కల్పిస్తోంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP) వడ్డీ రేట్లు KVP Interest Rates : తపాలా శాఖ ఈ కేవీపీ స్కీమ్‌పై 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
పోస్ట్ ఆఫీస్ ఆర్డీ (5 ఏళ్లు టెర్మ్) వడ్డీ రేట్లు 5 Years Post Office RD Latest Rates : ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌పై తపాలా శాఖ 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్ వడ్డీ రేట్లు Post Office Time Deposit Account Latest Rates : మదుపరులు ఈ స్కీమ్‌లో 1/ 2/ 3/ 5 ఏళ్లు కాలవ్యవధితో డిపాజిట్ చేసుకోవచ్చు. వాస్తవానికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే ఈ స్కీమ్ వడ్డీ రేట్లు కూడా ఉంటాయి.
స్కీమ్ టెర్మ్
వడ్డీ రేటు
1 సంవత్సరం డిపాజిట్
6.9 శాతం
2 సంవత్సరం డిపాజిట్
7.0 శాతం
3 సంవత్సరం డిపాజిట్
7.0 శాతం
5 సంవత్సరం డిపాజిట్
7.5 శాతం
నోట్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత మూడు ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లోనూ.. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అందువల్ల ఈ పోస్టు ఆఫీస్ స్కీమ్ వడ్డీ రేట్లలోనూ ఎలాంటి మార్పు జరగలేదు.