New Tata Safari, Harrier Facelift Cars Launched : దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండగల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ వాహన రంగ సంస్థలు కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇప్పటికే చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ నయా మోడల్ బైక్‌లు, కార్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. తాజాగా.. ప్రముఖ దేశీయ వాహన ఉత్పత్తి దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors).. సఫారీ, హారియర్ అప్‌గ్రేడెడ్ వెర్షన్స్‌ను లాంచ్ చేసింది. ఏడు ఎయిర్ బ్యాగ్స్ సహా సరికొత్త ఫీచర్లతో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) సఫారీ ఫేస్‌లిఫ్ట్(Tata Safari Facelift 2023), ప్రీమియం SUV హారియర్ ఫేస్‌లిఫ్ట్(Tata Harrier Facelift 2023) కార్లను టాటా కంపెనీ అక్టోబర్ 17న మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంతకీ ఈ కార్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
Tata Safari, Harrier Facelift 2023 Launched : అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టాటా మోటార్స్ SUV సఫారీ, హారియర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ మార్కెట్లోకి రానే వచ్చేశాయి. ఈ SUVటాటా సఫారి(Tata Safari), హారియర్(Tata Harrier) కొత్త వెర్షన్ కార్లు ఎన్నో అధునాత ఫీచర్స్ కలిగి ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే సఫారీ ఫేస్‌లిఫ్ట్, హారియర్ ఫేస్‌లిఫ్ట్ కార్లు గ్లోబల్ NCAPలో ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కేటగిరీలలో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందాయి. ఇప్పటి వరకు భారత మార్కెట్లో పరీక్షించిన అన్ని వాహనాల్లో.. ఈ రెండు SUVలు పెద్దలు, పిల్లల భద్రత కోసం అత్యధిక గ్లోబల్ NCAP స్కోర్‌ను సాధించాయి. ఇక ఫీచర్లు, ధర ఎంతో ఇప్పుడు చూద్దాం.
Tata Safari, Harrier Facelift Features in Telugu :ఇంజిన్ విషయానికొస్తే.. గత వేరియంట్ల మాదిరిగానే కొత్త హారియర్, సఫారీ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తోనే వస్తున్నాయి. 6-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్ ఈ కార్లలో ఉంటుంది. ఈ ఇంజిన్ 167.6 బీహెచ్ పీ శక్తిని, 350 ఎన్ఏ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇవి ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లలో లభిస్తాయి.
Tata Upcoming Cars In India : అదిరే ఫీచర్లతో.. 500 కి.మీ రేంజ్‌తో.. రానున్న టాటా 'ఈవీ' కార్స్ ఇవే!