తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్చిలో బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే..

మీరు మార్చి నెలలో బ్యాంకుకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే ఇది మీకోసమే! ఆర్​బీఐ లెక్కల ప్రకారం మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. ఆ రోజుల్లో మీరు బ్యాంకు లావాదేవీలు పెట్టుకుంటే ఇబ్బంది పడవలసి ఉంటుంది. అప్పుడు ఆన్​లైన్​ బ్యాంకింగ్​ మాత్రమే పనిచేస్తుంది.

list-of-bank-holidays-in-march-2023
మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!

By

Published : Feb 28, 2023, 2:46 PM IST

మార్చి నెలలో మీకు సంబంధించిన బ్యాంకులో ఏదైనా పని ఉండి వెళ్లాలనుకుంటే ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే. ముందుగా రిజర్వ్​​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా ప్రకటించిన సెలవులు జాబితాను చూడాలి. అవును మరి.. ఈ మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు రానున్నాయి. అయ్యో.. తెలియకుండా అనవసరంగా చాలా బ్యాంకు పనులు పెట్టుకున్నానే.. అని కంగారు పడవద్దు. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు.. కొన్ని స్టేట్​లకు మాత్రమే. ఏఏ తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయో తెలుసుకుంటే.. ఆ మేరకు ప్రణాళికలు వేసుకోవటానికి వీలుంటుంది.

బ్యాంకు సెలవులు ఎప్పుడూ అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు. కేంద్ర బ్యాంకులు సెలవులను జాతీయంగా, ప్రాంతీయంగా వర్గీకరిస్తాయి. మొదటి కేటగిరిలో భారతదేశం అంతటా సెలవులు వర్తిస్తాయి. అయితే ప్రాంతీయ సెలవులు మాత్రం.. రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక పండుగలు, రోజుల ఆధారంగా మారుతుంటాయి. కాబట్టి ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవన్నమాట!

  • మార్చి 03 : చాప్‌చార్ కుట్.. ఇది మిజోరం ప్రాంతీయ పండుగ. ఈ రాష్ట్రంలో మాత్రమే బ్యాంకులకు సెలవు.
  • మార్చి 05 : ఆదివారం. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • మార్చి 07 : హోలీ పండుగ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్​ జమ్ముకశ్మీర్​, ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, ఝార్ఖండ్, బంగాల్​​)
  • మార్చి 08 : హోలీ పండుగ (గుజరాత్​, ఒడిశా, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​, సిక్కిం, మిజోరం, త్రిపుర)
  • మార్చి 09 : హోలీ పండుగ (బిహార్)
  • మార్చి 11 : రెండో శనివారం. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • మార్చి 12 : ఆదివారం. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • మార్చి 19 : ఆదివారం. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • మార్చి 22 : ఉగాది పండుగ.. ఈ రోజున తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కర్ణాటక, గోవా, బిహార్​, మణిపుర్​ ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • మార్చి 25 : నాల్గవ శనివారం. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • మార్చి 26 : ఆదివారం. దేశంలోని బ్యాంకులు అన్నింటికీ సెలవు.
  • మార్చి 30 : శ్రీ రామ నవమి పండుగ.
  • ఇవీ చదవండి:
  • దటీజ్​ మస్క్.. సంపన్నుల జాబితాలో మళ్లీ టాప్.. 2 నెలల్లోనే..
  • 91 ఏళ్ల వయసులో 'ప్రేమ'లో పడిన డీఎల్​ఎఫ్ అధినేత.. 'ఆమె' ఎవరంటే..

ABOUT THE AUTHOR

...view details