Swiggy Biryani orders per year : పార్టీ ఏదైనా, గెస్ట్‌లు ఎవరైనా.. బిర్యానీ మస్ట్! బోర్ కొట్టినా, వంట చేయడానికి బద్ధకంగా అనిపించినా.. మొదటగా గుర్తొచ్చేది బిర్యానీనే. అంతలా భారతీయుల జీవనశైలిలో భాగమైపోయింది బిర్యానీ. అందుకే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోనూ బిర్యానీనే కింగ్. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కొన్ని లెక్కలు బయటపెట్టింది ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ. గత 12 నెలల్లో భారత దేశవ్యాప్తంగా ఉన్న భోజన ప్రియులు ఏకంగా 7.6కోట్ల బిర్యానీలను ఆన్లైన్లో ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.
బిర్యానీ బిజినెస్-టాప్ హైలైట్స్
- Swiggy biryani orders stats : 2022 జూన్ నుంచి 2023 జూన్ వరకు మొత్తం 7.6కోట్ల బిర్యానీలకు ఆర్డర్.
- క్రితం ఏడాది ఇదే సమయంతో పోల్చితే గత ఐదున్నర నెలల్లో బిర్యానీ ఆర్డర్లలో 8.26శాతం వృద్ధి.
- స్విగ్గీ ద్వారా దేశవ్యాప్తంగా బిర్యానీ డెలివరీ చేస్తున్న రెస్టారెంట్ల సంఖ్య 2.6లక్షలు.
- హైదరాబాద్ దమ్ బిర్యానీ, లఖ్‌నవూ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, మలబార్ బిర్యానీలకు ఆదరణ.
- స్విగ్గీ ద్వారా బిర్యానీ కోసం నిమిషానికి 219 ఆర్డర్లు.
ఆటోకు NO.. బెంజ్‌కు YES.. సీఎం ఇంటి వద్ద బక్రీద్ స్పెషల్ బిర్యానీ కహానీ!
బిర్యానీ ప్రేమికులకు స్వర్గధామంగా నిలిచింది బెంగళూరు. ఆ నగరంలో ఏకంగా 24వేల రెస్టారెంట్లు ఘుమఘుమలాడే బిర్యానీని వండి వడ్డిస్తున్నాయి. ఆ తర్వాత 22వేల రెస్టారెంట్లతో ముంబయి రెండో స్థానంలో ఉంది. దిల్లీలో బిర్యానీ సెర్వ్ చేసే రెస్టారెంట్ల సంఖ్య 20వేలు. హైదరాబాద్‌లో ఈ సంఖ్య 15వేలు.
రెస్టారెంట్ల సంఖ్య విషయంలో బెంగళూరు అగ్రస్థానంలో ఉన్నా.. ఆర్డర్లలో మాత్రం హైదరాబాద్ బాద్షాగా నిలిచింది. 2023 జనవరి- జూన్ మధ్య కాలంలో స్విగ్గీ ద్వారా హైదరాబాదీలు ఏకంగా 72 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేశారు. ఆ తర్వాత స్థానంలో బెంగళూరు ఉంది. ఆ నగర ప్రజలు 6 నెలల కాలంలో 50 లక్షల బిర్యానీలు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసి, లాగించేశారు. చెన్నైవాసులు 30లక్షల బిర్యానీలు ఇంటికి తెప్పించుకుని తిన్నారు.
బిర్యానీ గురించి 'గొడవ'.. సారీ చెప్పించిన సత్య నాదెళ్ల
బెస్ట్ బిర్యానీ అదేనట..
దమ్ బిర్యానీ.. ఆన్లైన్ డెలివరీల్లో కింగ్‌గా నిలిచింది. స్విగ్గీ ద్వారా మొత్తం 85 రకాల దమ్ బిర్యానీల కోసం 62 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఆ తర్వాత బిర్యానీ రైస్‌ను 35 లక్షల మంది ఆర్డర్ చేశారు. 28 లక్షల ఆర్డర్లతో హైదరాబాదీ బిర్యానీ మూడో స్థానంలో ఉంది.
బిర్యానీ కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేశారు ఓ చెన్నైవాసి. ఆ బిర్యానీ ప్రేమికుడు.. ఒకేసారి ఏకంగా రూ.31,532 విలువైన బిర్యానీని స్విగ్గీ యాప్ ద్వారా ఒకేసారి ఆర్డర్ ఇచ్చారు.