ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్తు వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది హ్యుందాయ్ సంస్థ. ఇప్పటికే కోనా పేరుతో ఈవీ కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. కొత్తగా తన వాహన శ్రేణిలోని ఎస్‌యూవీ విభాగంలో అయోనిక్5ను తీసుకొచ్చింది. రూ.లక్షతో బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ మంగళవారం ప్రకటించింది.
అధునాతన టెక్నాలజీ, సరికొత్త హంగులతో అయోనిక్5 ఈవీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది హ్యుందాయ్. ఈ కారుకు 20అంగుళాల అలాయ్ వీల్స్ అమర్చారు. వర్చువల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇంటర్నేషనల్ మోడల్ రెండు వేరియంట్స్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 72.6 కిలోవాట్ బ్యాటరీ కలిగిన వాహనం ఒకసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.(ఏఆర్‌ఏఐ ధ్రువీకరించిన దూరం) ప్రయాణించవచ్చు. ఇక 58 కిలోవాట్, బ్యాటరీ వేరియంట్‌ను ఒకసారి ఛార్జ్ చేస్తే, వరుసగా 385 కి.మీ. వెళ్లవచ్చు. 100కి.మీ వేగాన్ని కేవలం 7.6 సెకన్లలో అయోనిక్5 అందుకుంటుంది. ఇక 10 నుంచి 80శాతం ఛార్జింగ్ అవడానికి కేవలం 18 నిమిషాలు సరిపోతాయని హ్యుందాయ్ చెబుతోంది.