కొరియన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ నూతనంగా కారు కొనే వినియోగదారులకు తీపి కబురు అందించింది. ఈ కంపెనీ తయారు చేసిన కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ నెలలోనే ఉండటం విశేషం. కొత్త కారు తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి తరుణం!
గ్రాండ్ i10 నియోస్, ఆరా, ఐ20, వెన్యూ, వెర్నా, క్రెటా, టక్సన్, అల్కజార్ వంటి మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించింది హ్యుందాయ్. వీటితో పాటు అయోనిక్ 5, కోనా ఈవీ వంటి ఎలక్ట్రిక్ వాహనాలకు సైతం రాయితీ ఇవ్వనుంది. అయితే ఆయా వాహనాలపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో రూ.50 వేల వరకు తగ్గింపు అందిస్తుంది.
- పెట్రోల్‌తో నడిచే వాహనాలైన నియోస్, ఆరాపై రూ.23 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.10 వేలు నగదు, రూ.10 వేలు ఎక్స్చేంజ్, మరో రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో హ్యుందాయ్ ఇవ్వనుంది.
- సీఎన్‌జీ పవర్ ట్రెన్తో నడిచే ఇవే మోడళ్లపై రూ.20 వేల వరకు నగదు, రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, మరో రూ.3 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తోంది.
- ఐ20 మోడల్‌లో మాగ్న, స్పోర్ట్స్ వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీటిపై రూ.10 వేల వరకు నగదు, రూ.10 వేల వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్లు ఉంటాయని కంపెనీ తెలిపింది.
- ఎన్ లైన్ మోడల్‌పై రూ.15 వేల వరకు అదనపు ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. తమ ఎలక్ట్రికల్ వాహనమైన కోనా ఈవీపై రూ.50 వేల వరకు ప్రయోజనాలు ఉంటాయని చెప్పింది.
- హ్యుందాయ్ వెన్యూ, వెర్నా, క్రెటా, టక్సన్, అల్కజార్ మోడళ్లపై ఈ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ వర్తించదని తెలిపింది.