How to get Sodexo Meal Card in Telugu :ఈ కాలంలో ఉద్యోగులు ఆఫీసుల్లో భోజనం కోసం.. గతంలో మాదిరిగా నగదు లేదా కూపన్లు వాడట్లేదు.టెక్నాలజీతో ఆ విభాగం కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పటికే చాలా మంది ఇ-వాలెట్(E-wallets)ల రూపంలో మనీ చెల్లిస్తుండగా.. మరోవైపు "మీల్ కార్డ్స్" వచ్చేశాయి. వీటితో తమకు కావాల్సిన భోజనాన్ని ఎక్కడైనా ఎంచుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఆ కార్డులలో ఒకటే.. "సోడెక్సో మీల్ కార్డ్". ఇంతకీ.. సోడెక్సో మీల్ కార్డు అంటే ఏమిటి..? దానిని ఎలా పొందాలి..? ఎక్కడెక్కడ ఈ కార్డుని ఉపయోగించవచ్చు..? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
What is Sodexo Meal Card :సోడెక్సో మీల్ కార్డ్ అనేది పూర్తి డిజిటల్ మీల్ కార్డ్. ఇది ఉద్యోగులకు పన్నులు ఆదా చేయడంలో సహాయపడుతుంది. Sodexo యాజమాన్యం భోజన వ్యాపారి నెట్‌వర్క్ ఉద్యోగులకు భోజనం విషయంలో అనేక ఎంపికలు, ప్రయోజనాలు అందిస్తోంది. ఈ కార్డ్‌ను దేశంలోని అతిపెద్ద యాజమాన్య భోజన వ్యాపారి నెట్‌వర్క్‌లో ఉపయోగించవచ్చు. ఇది Zomato, Swiggy, Freshmenu, Grofers, BigBasket వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ పోర్టల్‌లతో సహా 1700+ నగరాల్లో 1,00,000+ అవుట్‌లెట్లలో విస్తరించి ఉంది.
Sodexo మీల్ కార్డ్‌ని ఎలా పొందాలంటే..?
How to Get Sodexo Meal Card in Telugu :సాధారణంగా సోడెక్సో మీల్ కార్డ్‌ని కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు అందిస్తాయి. ఈ మీల్ కార్డ్ కార్పొరేట్ ఉద్యోగుల కోసం మాత్రమే. కార్పొరేట్ యజమానులు సోడెక్సోలో సైన్ అప్ చేయాలి. పన్నులను ఆదా చేయడానికి దేశంలోని అనేక నగరాల్లో ఆహారాన్ని ఆస్వాదించడానికి వారి ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను అందిస్తాయి. మీరు ప్లే స్టోర్‌లో Sodexo–Zeta యాప్‌ను చూడొచ్చు. కానీ.. ఇది “కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమే” అనే విషయం గుర్తుంచుకోవాలి. అయితే.. ఇంతకీ సోడెక్సో కార్డును ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
How to Activate Sodexo Meal Card in Telugu :
సోడెక్సో మీల్ కార్డ్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..?
- ఈ మీల్ కార్డ్ మీ యజమాని ద్వారా మీకు పంపబడుతుంది. అప్పుడు మీరు సొంతంగా సోడెక్సో కార్డ్‌ని యాక్టివేట్ చేసుకోవాలి.
- మొదట మీరు Pluxee అనే సోడెక్సో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఇప్పుడు అందులో ఆటోమేటిక్‌గా కార్డ్ యాక్టివేషన్ ఆప్షన్ ఎంచుకోబడుతుంది. కాకపోతే, కార్డ్ యాక్టివేషన్‌ను మాన్యువల్‌గా చేసుకోవాలి.
- ఆ తర్వాత బాక్స్‌లో నమోదిత ఈ-మెయిల్ చిరునామా లేదా మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఆపై మీకు అందించిన కార్డ్ రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయాలి.
- అలాగే అక్కడ ఇచ్చిన క్యాప్చాను నమోదు చేసి.. ఆపై యాక్టివేషన్ కోడ్ పొందు బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు ఈ-మెయిల్ లేదా మొబైల్ నంబర్‌లో అందుకున్న కోడ్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత యాక్టివేట్ యువర్ కార్డ్‌పై ప్రెస్ చేయాలి.
- ఒకవేళ మీకు రిఫరెన్స్ నంబర్ తెలియకున్నా.. లేదా పోగొట్టుకున్నట్లయితే 'forgot reference number'పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి. ఆపై మీ కార్డ్ నంబర్ చివరి నాలుగు అంకెలను ఎంటర్ చేయాలి.
- అన్ని వివరాలను అందించిన తర్వాత ఫారమ్‌ను సమర్పించాలి.
- ఇప్పుడు మీరు కార్డ్ రిఫరెన్స్ నంబర్‌ను పొందుతారు. ఆ తర్వాత పై విధానం ద్వారా మీ కార్డు యాక్టివేట్ చేసుకోవాలి.