తెలంగాణ

telangana

ETV Bharat / business

How to Deal With Loan Recovery Agents Harassment : లోన్​ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా..? ఇలా వారి పని పట్టండి.. మీ జోలికి రారు! - లోన్​ వేధింపులపై ఆర్బీఐ మార్గదర్శకాలు

How to Deal Loan Recovery Agents Harassment: అవసరానికి అప్పు తీసుకోవడం ఎవరికైనా తప్పదు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి లోన్​లు తీసుకుంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్కోసారి అప్పును సకాలంలో తిరిగి చెల్లించడం కుదరకపోవచ్చు. బ్యాంకు నుంచి పదేపదే ఫోన్ కాల్స్ వస్తుంటాయి. కొంతకాలం తర్వాత లోన్ రికవరీ ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. అప్పు తీసుకున్నవారికి ఈ లోన్ రికవరీ ఏజెంట్లతో తిప్పలు తప్పవు. మరి రికవరీ ఏజెంట్లు మీపై ఒత్తిడి చేయడం, వేధింపులకు గురి చేస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఈ కథనంలో తెలుసుకుందాం.

How_to_Deal_With_Loan_Recovery_Agents_Harassment
How_to_Deal_With_Loan_Recovery_Agents_Harassment

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 9:48 AM IST

How to Deal Loan Recovery Agents Harassment:రుణాలు తీసుకున్న వారిపై రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్నారనే సంఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత రిజర్వు బ్యాంక్​ ఆఫ్​ ఇండియా(RBI) మారటోరియం ఎత్తివేసింది. దీంతో బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్​ సంస్థలు లోన్ రికవరీ కోసం రికవరీ ఏజెంట్లపై ఒత్తిడి పెడుతున్నాయి. దీంతో వారు.. లోన్ తీసుకున్న వారి నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని హద్దులు మీరి మరి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

RBI Guidelines on Recovery Agents Harassments: రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి ప్రజలను కాపాడేందుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రికవరీ ఏజెంట్లు, వారి చర్యల బాధ్యత కూడా బ్యాంకులు, ఇతర ఫిన్‌టెక్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీలపై ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు.. రికవరీ ఏజెంట్లు అప్పు తీసుకున్న వారిపై ఒత్తిడి పెంచడం, దుర్భాషలు, శారీరకంగా గాయపరచడం వంటి వేధింపులకు పాల్పడడం నేరమని పేర్కొంది. బహిరంగంగా రుణ గ్రహీతలను "ఒత్తిడి చేయడం..." "భంగం కలిగించడం.. వంటివి చేయకూడదని.. స్పష్టం చేసింది. అలాగే.. రికవరీ ఏజెంట్లు లోన్ తీసుకున్న వారికి ఫోన్లు, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సందేశాలు చేయకూడదని తెలిపింది. మరోవైపు.. లోన్ తీసుకున్నవారిని బెదిరించడం, ఉదయం 8 గంటలలోపు, రాత్రి 7 గంటల తర్వాత వారి ఇంటికి వెళ్లకూడదని స్పష్టం చేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు (RBI Guidelines for Recovery Agents) జారీ చేసినప్పటికీ రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు ఇంకా వెలుగుచూస్తూనే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం తమ హక్కులపై సరైన అవగాహన లేకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ మీరు ఏదైనా లోన్ తీసుకుని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రికవరీ ఏజెంట్లు మీపై ఒత్తిడి చేయడం, వేధింపులకు గురి చేస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

  • రికవరీ ఏజెంట్లు మీపై వేధింపులకు పాల్పడినట్లయితే.. వారి కాల్ డేటా, ఎస్ఎంఎస్‌లు, ఈమెయిల్స్​లను భద్రపరుచుకోవాలి. వాటి సాయంతో మీరు ఫిర్యాదు చేసి వారి వేధింపులను నిరూపించవచ్చు.
  • రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి మీరు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇది ముందుగా చేయాల్సిన పని. ఒక వేళ పోలీసులు మీ కంప్లైంట్ తీసుకోకపోతే మీరు న్యాయస్థానం ద్వారా ఉపశమనం పొందవచ్చు. మీపై వేధింపులకు పరిహారం కూడా కోరవచ్చు.
  • మీరు మీ బ్యాంకు లేదా లోన్ ఆఫీసర్​ను సంప్రదించి రికవరీ ఏజెంట్లు చేస్తున్న వేధింపులను నివేదించవచ్చు. దీంతో వారు రికవరీ ఏజెంట్లపై సరైన చర్యలు తీసుకుంటారు. దీంతో ఏజెంట్ల నుంచి అలాంటి వేధింపులు ఆగిపోతాయి.
  • అప్పటికీ రికవరీ ఏజెంట్ల వేధింపులు కొనసాగితే.. రుణ గ్రహీతలు నేరుగా ఆర్‌బీఐకి ఈ-మెయిల్ ద్వారా కంప్లైంట్​ చేయవచ్చు. వారికి ఎదురైన పరిస్థితులను, ఫిర్యాదులను ఆ మెయిల్​లో పేర్కొనాలి. రిజర్వ్ బ్యాంక్.. మీ ప్రాంతంలో రికవరీ ఏజెంట్లను బ్యాన్ చేసే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నట్లు నిరూపణ అయితే ఈ బ్యాన్‌ను పొడిగించే అవకాశం ఉంటుంది.
  • రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి, ఆఫీసుకు వచ్చి, స్నేహితులు, తోటి ఉద్యోగుల ముందు ఇష్టారీతిన ప్రవర్తిస్తూ మీ స్వేచ్ఛకు, గౌరవానికి భంగం కలిగించినట్లయితే మీరు బ్యాంకు, రికవరీ ఏజెంట్లపై పరువు నష్టం దావా వేయవచ్చు.

లోన్​ రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా?.. అయితే ఇలా చేయండి.. మీ జోలికి అస్సలు రారు!

ABOUT THE AUTHOR

...view details