How to Check Income Tax Refund Status : ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను వాపసు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. మీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జులై 31లోపు ఐటీఆర్ ఫైల్ చేసి.. ఇప్పుడు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే.. వాస్తవానికి మొదట ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తి అయ్యాకే రిఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి.. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయితేనే మీకు రావాల్సిన రిఫండ్ మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
Income Tax Refund Status Check in Online :అయితే.. దీని కోసం మీ బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా పాన్కార్డుకి లింక్ అయ్యి ఉండాలి. ఇంతకుముందు తీరుగా ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ(Income Tax Department) చెక్కులు జారీ చేయడం లేదు. గతంలో ఎవరైనా ఐటీఆర్ రిఫండ్ పొందడానికి 7 రోజుల నుంచి 4 నెలల సమయం పట్టేది. కానీ.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతికత కారణంగా కొన్ని రోజుల వ్యవధలోనే పౌరులు తమ ఆదాయ పన్ను రిఫండ్లను పొందుగలుగుతున్నారు.
అయితే.. మీరు ఆదాయ పన్ను పత్రాలు సమర్పించి మీకు రావాల్సిన ఇన్‌కం ట్యాక్స్ రిఫండ్‌ను ఇంకా అందుకోకపోతే.. ఇప్పుడే ఆన్లైన్లో సులభంగా మీ రిఫండ్ స్టేటస్‌ను చెక్ చేసుకోండి. మీ ఆదాయ పన్ను రిఫండ్ ప్రక్రియ ఎంత వరకు ఎచ్చిందో స్టేటస్ ద్వారా మీకు తెలుస్తుంది. మరి, ఏ విధంగా మీ రిఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Income Tax Refund : ఆదాయ పన్ను రిఫండ్ రావాలంటే.. ఇలా చేయండి!
How to Check Income Tax Refund Status in Online :
ఆన్లైన్లో ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ స్టేటస్ తెలుసుకోవడం ఎలాగో చూద్దాం..
- ముందుగా మీరు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ని సందర్శించాలి.
- అనంతరం మీ యూజర్ ఐడీ(పాన్ కార్డు నంబర్), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత 'వ్యూ రిటర్న్స్ అండ్ ఫార్మ్స్ 'పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ఓపెన్ అయిన పేజీలో 'ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 'ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అనంతరం మీ ఐటీఆర్‌కు సంబంధించి 'అసెస్మెంట్ ఇయర్'ను ఎంచుకొని సబ్మిట్ నొక్కాలి.
- చివరగా మీ ఐటీఆర్ రిఫండ్ స్టేటస్‌కు సంబంధించి పూర్తి వివరాల కోసం 'ITR Acknowledgment Number'పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీ ఐటీఆర్ రిఫండ్ ప్రక్రియ పూర్తి అయ్యిందా? లేదా? అనేది తెలుస్తుంది.
ఈ ప్రక్రియకు అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ అవసరం.. అది ఎలా తెలుసుకోవాలో చూద్దాం..