How to Check Credit Score in PhonePe for Free: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ యూజర్లకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. క్రెడిట్ స్కోర్‌ను ఉచితంగా తెలుసుకునేందుకు వీలుగా ఓ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం...
క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకునేందుకు వీలుగా.. "‘క్రెడిట్"’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది ఈ సంస్థ. దీంట్లో క్రెడిట్ స్కోర్‌తో పాటు, క్రెడిట్ హిస్టరీని ఉచితంగానే తెలుసుకోవచ్చు. ఇంకా క్రెడిట్ కార్డుల నిర్వహణ, బిల్ పేమెంట్స్, రుణ వాయిదాల చెల్లింపుల వివరాల్ని కూడా ఈ ఫీచర్‌తో సమర్థంగా మేనేజ్ చేసుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. మరి ఫోన్‌పేలో క్రెడిట్ స్కోర్ ఫ్రీగా ఎలా చెక్ చేసుకోవాలి..?
అమెజాన్ యూజర్లకు గుడ్ న్యూస్ - డబ్బులు లేకున్నా షాపింగ్ చేసే అవకాశం - ఎలా అంటే?
- ముందుగా మీ ఫోన్లో PhonePe యాప్‌ను ఓపెన్ చేయాలి.
- యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్‌పేజీలోనే Credit అనే ట్యాబ్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే.. యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
- ఇప్పుడు Credit పై క్లిక్ చేస్తే "Credit Score for Free"‘అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- దాని కిందే Check Now అనే బటన్ ఉంటుంది. దానిని క్లిక్ చేయాలి.
- వెంటనే క్రెడిట్ స్కోర్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఈ స్కోర్‌ను ఎక్స్‌పీరియెన్ క్రెడిట్ బ్యూరో అందిస్తోంది.
- ఈ స్కోర్‌తో పాటు సకాలంలో చెల్లింపులు, క్రెడిట్ వినియోగ నిష్పత్తి, క్రెడిట్ మిక్స్, క్రెడిట్ ఏజ్, రుణ ఎంక్వైరీల వంటి ఇతర సమాచారం కూడా చూసుకోవచ్చు.
బీ అలర్ట్- జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్! కచ్చితంగా తెలుసుకోండి!
అంతేకాకుండా.. ఈ ఫీచర్‌లో మేనేజ్ క్రెడిట్స్, రుణ ప్రొఫైల్, పేమెంట్ డ్యూస్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వీటి ద్వారా క్రెడిట్ కార్డుల నిర్వహణ, రుణ చెల్లింపుల వంటి సమాచారాన్ని సమర్థంగా నిర్వహించుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేసి ఎప్పటికప్పుడు బిల్లు, ఈఎంఐల చెల్లింపుల స్థితిని సమీక్షించుకోవచ్చు. అయితే, ఫోన్‌పేలో లాగిన్ అయిన ఫోన్ నెంబర్.. పాన్‌కార్డుతో అనుసంధానమైన నెంబర్ ఒకటే అయి ఉండాలి.