How to Check CIBIL Score in Telugu : ఇటీవలి కాలంలో జనాల్లో సిబిల్ స్కోర్‌పై అవగాహన పెరుగుతోంది. చాలా మందికి ఈ సిబిల్ స్కోర్ విలువ తెలిసి వస్తుండటంతో దానిని మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నారు. ఏదైనా కొత్త క్రెడిట్ దరఖాస్తును ఆమోదించే ముందు రుణదాతలు జాగ్రత్తగా అంచనా వేయడానికి మీ క్రెడిట్ నివేదికలో ఈ సిబిల్ స్కోర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ప్రజలు ఈ సిబిల్ స్కోర్ ఏ విధంగా తెలుసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. చాలా సింపుల్‌గా ఆన్లైన్లో మీ పాన్‌కార్డు(PAN Card)వివరాలు, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, తదితర వ్యక్తిగత వివరాలతో తెలుసుకోవచ్చు. అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి, దానిని ఎలా చెక్ చేసుకోవాలి, దాని ద్వారా ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..
అసలు CIBIL స్కోర్ అంటే ఏమిటి?
What is CIBIL Score :రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) లైసెన్స్ పొందిన నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అత్యంత ప్రసిద్ధి చెందినది. దాదాపు 300 నుంచి 900 వరకు సిబిల్ స్కోరు ఉంటుంది. 750 స్కోర్ ఉంటే నిపుణులు మంచిదని చెబుతున్నారు. ఇది మీ క్రెడిట్ హిస్టరీ, రేటింగ్లను సూచించే మూడు అంకెల సంఖ్యా సారాంశం. మీ స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే ఇది అంత తక్కువగా ఉంటుంది. క్రెడిట్లో యోగ్యతను పొందాలంటే ఈ సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమైనది.
సిబిల్ స్కోర్ ఉపయోగాలేంటో చూద్దాం..
CIBIL Score Benefits in Telugu :సిబిల్ అనేది ఒక క్రెడిట్ బ్యూరో. మీ క్రెడిట్ హిస్టరీ సమాచారాన్ని కలెక్ట్ చేసి మీకు ఇదిసిబిల్ స్కోర్(CIBIL Score)ను అందిస్తుంది. మంచి సిబిల్ స్కోర్ వల్ల కలిగే ఉపయోగాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- దీని ద్వారా లోన్ అప్లికేషన్ ప్రక్రియ వేగంగా జరిగిపోతుంది.
- అలాగే లోన్ డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఈ స్కోర్ ద్వారా సులభమైపోతుంది.
- ఈ సిబిల్ స్కోర్‌తో తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉంది.
- ఈ స్కోర్ ద్వారా రీపేమెంట్ టెన్యూర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే లోన్ ఆప్షన్స్ పెరుగుతాయి.