Honda New Bike launch :పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ సరికొత్త బైక్‌లను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా సెప్టెంబర్ 26న హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. సరికొత్త ఎస్పీ 125 స్పోర్ట్స్ ఎడిషన్ బైక్‌ను లాంఛ్ చేసింది. మరోవైపు బజాజ్ కంపెనీ పల్సర్ ఎన్ 150 బైక్‌ను విడుదల చేసింది. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Honda SP125 Sport Edition Features :
- హోండా ఎస్పీ 125 బైక్.. డీసెంట్ బ్లూ మెటాలిక్, హెవీ గ్రే మెటాలిక్ అనే రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ బైక్ - హోండా ఎస్పీ 125 బైక్‌లో.. 123.94సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 10.9Nm టార్క్, 10.72BHP పవర్ జనరేట్ చేస్తుంది. వాస్తవానికి ఈ ఇంజిన్‌ను ఇటీవలే BS-VI OBD-2 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేయడం జరిగింది.
హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ బైక్ - చాలా హోండా టూ-వీలర్స్ లాగానే.. హోండా ఎస్పీ 125 స్పెషల్ ఎడిషన్ బైక్‌కు కూడా 10 సంవత్సరాల వారెంటీ లభిస్తుంది. అంటే 3 సంవత్సరాల స్టాండర్డ్, 7 సంవత్సరాల ఆప్షనల్ వారెంటీ ఉంటుంది.
హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ బైక్ - హోండా ఎస్పీ 125 బైక్‌లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, బాడీ ప్యానెల్స్, అల్లాయ్ వీల్స్ సహా పలు బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
Honda SP125 Sport Edition Price : ప్రస్తుతం హోండా ఎస్పీ 125 స్పోర్ట్స్ ఎడిషన్ బైక్ ధర రూ.90,567 (ఎక్స్ షోరూం)గా ఉంది. దేశంలోని అన్ని హోండా రెడ్ విగ్ డీలర్షిప్ల్లోనూ ఈ బైక్ లభిస్తుంది. అయితే ఇది లిమిటెడ్ (పండుగ సీజన్) పీరియడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అని కంపెనీ స్పష్టం చేసింది.
హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్ బైక్ Bajaj Pulsar N150 Feature
- బజాజ్ కంపెనీ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పల్సర్ ఎన్150 బైక్‌ను లాంఛ్ చేసింది.
- వాస్తవానికి పల్సర్ పీ150లోని ఇంజిన్నే.. పల్సర్ ఎన్ 150 బైక్‌లోనూ అమర్చడం జరిగింది.
- బజాజ్ పల్సర్ ఎన్ 150 బైక్‌లో.. 149.6సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అమర్చారు. ఇది 8,500rpm వద్ద 14.5bhp పవర్, 6000rpm వద్ద 13.5Nm టార్క్ జనరేట్ చేస్తుంది.
- బజాజ్ పల్సర్ ఎన్ 150 బైక్‌లో.. 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఫెసిలిటీ ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. దీనిలో సింగిల్ ఛానల్ ఎబీఎస్ సిస్టమ్ సపోర్ట్‌తో.. 260mm ఫ్రంట్ డిస్క్, 130mm రియర్ డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
- డిజైన్ విషయానికి వస్తే.. పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్250 బైక్ డిజైన్లనే... పల్సర్ ఎన్150 స్టోర్ట్స్ ఎడిషన్‌లో కూడా వాడడం జరిగింది.
- పల్సర్ ఎన్150 బైక్ రెండు వైపులా.. స్పోర్టీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్‌ను అమర్చారు.
- పల్సర్ ఎన్ 150 బైక్‌లో ప్రత్యేకంగా సింగిల్ సీట్ సెటప్ ఉంది. అలాగే పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, బ్లాక్ ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
- బజాజ్ పల్సర్ ఎన్ 150 బైక్ మూడు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్, మెటాలిక్ పెర్ల్ వైట్.
బజాజ్ పల్సర్ ఎన్ 150 బైక్
Bajaj Pulsar N150 Price : ప్రసుతం బజాజ్ పల్సర్ ఎన్ 150 బైక్ ధర రూ.1,17,134 (ఎక్స్ షోరూం)గా ఉంది.
బజాజ్ పల్సర్ ఎన్ 150 బైక్