తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. నేటి లెక్కలు ఇలా - ప్రొద్దటూరులో ఈరోజు బంగారం వెండి ధర

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

today gold silver rates in telugu states
today gold silver rates in telugu states

By

Published : Mar 25, 2023, 12:26 PM IST

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల బంగారం ధర రూ.260 పెరిగి.. ప్రస్తుతం రూ.61,370గా ఉంది. కిలో వెండి ధర రూ.330 తగ్గి.. ప్రస్తుతం రూ.72,130 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,370వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.72,130 రూపాయలుగా ఉంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,370గా ఉంది. కిలో వెండి ధర రూ.72,130 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,370 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.72,130గా ఉంది.

Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,370గా ఉంది. కేజీ వెండి ధర రూ.72,130 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,977.70 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.25డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,65,939 పలుకుతోంది. ఇథీరియం, బైనాన్స్​ కాయిన్​, క్రిప్టోకరెన్సీలతో.. పాటుగా మిగతా వాటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.22,65,939
ఇథీరియం రూ.1,44,319
టెథర్​ రూ.82.45
బైనాన్స్​ కాయిన్​ రూ.26,681
యూఎస్​డీ కాయిన్ రూ.82.34

అమ్మకాల ఒత్తిడి.. నష్టాల్లో ప్రపంచ స్టాక్​ మార్కెట్లు..
శనివారం భారతీయ స్టాక్​ మార్కెట్లకు సెలవు. మరోవైపు.. శుక్రవారం అంతర్జాతీయంగా మార్కెట్లు ఒడుదొడుకులకు గురయ్యాయి. ఈ కారణంగా శుక్రవారం మధ్యాహ్నం వరకు సెన్సెక్స్ సూచీ ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. స్టాక్స్ మార్కెట్లు ముగిసేసరికి 398 పాయింట్ల నష్టంతో 57,422 వద్ద ముగిసింది. నిఫ్టీ 131 పాయింట్లు నష్టంతో 16,945 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే అమెరికా మార్కెట్లలో డోజోన్స్​ 73 పాయింట్లు పెరిగి 32,179 వద్ద స్థిరపడింది. ఇక, నాస్​డాక్​ 0.1 శాతం నష్టాన్ని చవిచూసింది. అధిక వడ్డీ రేట్లతో బ్యాంకుల బలహీన పడుతున్నాయన్న భయాలతో.. మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details