తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 4th September 2023 : స్వల్పంగా పెరిగిన గోల్డ్​, సిల్వర్​ రేట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 4th September 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 4th September 2023
Gold Rate Today 4th September 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 9:38 AM IST

Updated : Sep 4, 2023, 10:15 AM IST

Gold Rate Today 4th September 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.61,205గా ఉండగా.. సోమవారం రూ.195 పెరిగి రూ.61,400 వద్దకు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.75,764గా ఉండగా.. సోమవారం రూ.151 పెరిగి రూ.75,915కు చేరింది.

  • Gold Price In Hyderabad 4th September 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.61,400గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.75,915గా ఉంది.
  • Gold Price In Vijayawada 4th September 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.61,400గా ఉంది. కిలో వెండి ధర రూ.75,915కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 4th September 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,400గా ఉంది. కిలో వెండి ధర రూ.75,195గా ఉంది.
  • Gold Price In Proddatur 4th September 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.61,400గా ఉంది. కిలో వెండి ధర రూ.75,195కు చేరుకుంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 4th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1940 డాలర్లుగా ఉండగా.. సోమవారం 1945 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు గ్లోబల్​ మార్కెట్​లో సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఔన్స్​ వెండి ధర 24.29డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 4th September 2023 : సోమవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ మంచి లాభాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.21,47,489 వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.21,47,489
ఇథీరియం రూ.1,35,422
టెథర్​ రూ.82.64
బైనాన్స్ కాయిన్ రూ.17,773
యూఎస్​డీ కాయిన్​ రూ.82.70

స్టాక్​మార్కెట్​ అప్డేట్స్​​
Stock Market Today 4th September 2023 : సోమవారం దేశీయ స్టాక్​ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. దేశీయ జీడీపీ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా ఉండడం, విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీయడం వల్ల దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ ప్రస్తుతం 102 పాయింట్లు లాభపడి 65,489 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 43 పాయింట్లు వృద్ధి చెంది 19,478 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : టాటా స్టీల్​, ఎల్​ అండ్​ టీ, మారుతి సుజుకి, విప్రో, ఎన్​టీపీసీ, టీసీఎస్​
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు : ఏసియన్​ పెయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, యాక్సిస్ బ్యాంకు, టైటాన్​

రూపాయి విలువ!
Rupee Open 4th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 13 పైసలు తగ్గి రూ.82.75 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 4th September 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Priece Today 4th September 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.05 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 88.59 డాలర్లుగా ఉంది.

Last Updated : Sep 4, 2023, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details