తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today 25th October 2023 : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today 25th October 2023 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today 25th October 2023
Gold Rate Today 25th October 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 9:26 AM IST

Updated : Oct 25, 2023, 10:17 AM IST

Gold Rate Today 25th October 2023 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.62,448 ఉండగా.. బుధవారం రూ.93 తగ్గి రూ.62,355కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,602గా ఉండగా.. బుధవారం రూ.327 తగ్గి రూ.73,275కు చేరింది.

  • Gold Price In Hyderabad 25th October 2023 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.62,335గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.73,275గా ఉంది.
  • Gold Price In Vijayawada 25th October 2023 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.62,335గా ఉంది. కిలో వెండి ధర రూ.73,275కు చేరుకుంది.
  • Gold Price In Vishakhapatnam 25th October 2023 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,335గా ఉంది. కిలో వెండి ధర రూ.73,275గా ఉంది.
  • Gold Price In Proddatur 25th October 2023 : ప్రొద్దుటూరులో 10గ్రాముల పసిడి ధర రూ.62,335గా ఉంది. కిలో వెండి ధర రూ.73,275కు చేరింది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు.. ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 25th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1977 డాలర్లుగా ఉండగా.. బుధవారం 6 డాలర్లు తగ్గి 1971 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సిల్వర్​ ధరలు ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.90 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 25th October 2023 : బుధవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్​ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.28,22,377 వద్ద నష్టాల్లో ట్రేడవుతోంది. మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.28,22.377
ఇథీరియం రూ.1,48,523
టెథర్ రూ.82.86
బైనాన్స్ కాయిన్ రూ.18,921
యూఎస్​డీ కాయిన్ రూ.83.7

స్టాక్​ మార్కెట్​ అప్​డేట్స్​..
Stock Market Today 25th October 2023 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూలం సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. ఇండియాలో.. విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడం సహా, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కొంత మేరకు స్థిమితపడడం వల్ల మదుపరుల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగానే బుధవారం దేశీయ మార్కెట్లు మంచి లాభాలతో దూసుకుపోతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 61 పాయింట్లు లాభపడి 64,633 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 16 పాయింట్లు వృద్ధి చెంది 19,298 వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్స్​ : టాటా స్టీల్​, హెచ్​సీఎల్ టెక్​, కోటక్ బ్యాంక్​, విప్రో, ఎస్​బీఐ, హెచ్​డీఎఫ్​సీ, మారుతి సుజుకి
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఇన్ఫోసిస్​, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్​, టైటాన్​, టాటా మోటార్స్​, ఐటీసీ, ఎల్​ అండ్​ టీ

రూపాయి విలువ!
Rupee Open 25th October 2023: అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 7 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.09గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 25th October 2023 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడి చమురు ధరలు
Crude Oil Price 25th October 2023 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.07 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ ముడిచమురు ధర 88.13 డాలర్లుగా ఉంది.

Floating Rate Savings Bonds : రిటైల్ ఇన్వెస్టర్లకు గుడ్​ న్యూస్​.. ఇకపై ఆర్​బీఐ పోర్టల్​లోనే 'ఫ్లోటింగ్ బాండ్స్​' కొనుగోలుకు ఛాన్స్​!

EPF Advance For Marriage : పెళ్లి కోసం డబ్బులు కావాలా?.. ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందండిలా!

Last Updated : Oct 25, 2023, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details