తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Price Today : స్పల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Price Today : దేశంలో బంగారం, వెండి ధరలు మరింతగా దిగివస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో చూద్దామా?

Gold Price Today
Gold Price Today in India

By

Published : Jun 23, 2023, 11:18 AM IST

Gold Price Today : దేశంలో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్​ పసిడి ధర రూ.240 తగ్గి.. ప్రస్తుతం రూ.60,330 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.630 క్షీణించి.. ప్రస్తుతం రూ.69,000గా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

  • Gold Price in Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం సుమారుగా రూ.240 తగ్గి.. శుక్రవారం 60,155 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర గురువారం రూ.630 తగ్గి బుధవారం రూ.70,070 వద్ద ట్రేడవుతోంది.
  • Gold Price in Vijayawada : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.60,155గా ఉంది. కిలో వెండి ధర రూ.70,070గా ఉంది.
  • Gold Price in Vishakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.60,155గా ఉంది. కిలో వెండి ధర రూ.70,070గా ఉంది.
  • Gold Price in Proddatur : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.60,155గా ఉంది. కిలో వెండి ధర రూ.70,070గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Rate Today : అంతర్జాతీయంగా పసిడి ధరలు మరింతగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్​ ధర 1929 డాలర్లుగా, శుక్రవారం నాటికి సుమారు 13 డాలర్లు దిగివచ్చి 1916 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. ఉంది. మరోవైపు వెండి ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. శుక్రవారం ఔన్స్​ వెండి ధర 22.29 డాలర్లుగా ఉంది.

క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency Prices Today : బిట్​కాయిన్ విలువ రోజురోజుకూ వృద్ధి చెందుతూ ఉంది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్​ ధర రూ.24,57,359 వద్ద ట్రేడవుతోంది. ఇథీరియం, బైనాన్స్ కాయిన్, టెథర్​ మొదలైన క్రిప్టో కరెన్సీ ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.24,57,359
ఇథీరియం రూ.1,53,953
టెథర్ రూ.82.3
బైనాన్స్ కాయిన్ రూ.19,778
యూఎస్​డీ కాయిన్​ రూ.82.2

స్టాక్​మార్కెట్​ న్యూస్​
Stock Market News : దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం, ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీస్తుండడమే ఇందుకు కారణం. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 84 పాయింట్లు కోల్పోయి 63,150 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 46 పాయింట్లు నష్టపోయి 18,720 పాయింట్లు వద్ద ట్రేడ్​ అవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న షేర్లు :భారతీ ఎయిర్​టెల్​, ఎన్​టీపీసీ, ఏసియన్​ పెయింట్స్​, ఇండస్​ఇండ్​ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, మారుతి సుజుకి
  • నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్​లు :టెక్​ మహీంద్రా, పవర్​గ్రిడ్​, టాటా మోటార్స్​, ఇన్ఫోసిస్​, టైటాన్​, ఎస్​బీఐ, టాటా స్టీల్​

రూపాయి విలువ
Rupee Value : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ స్వల్పంగా తగ్గుతోంది. రూపాయి మారకపు విలువ డాలర్​తో పోల్చితే ఎనిమిది పైసలు తగ్గి రూ.82.05 వద్ద కొనసాగుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol Diesel Rates Today : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.65గా ఉంది. డీజిల్​ ధర రూ.97.80గా ఉంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.46గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.66గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details