Flipkart Big Billion Days Sale 2023 : ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అందులో భాగంగా త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్; అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్‌ను ప్రారంభించనున్నాయి. అందుకే అవి అందించనున్న బెస్ట్ డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్
వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 ప్రారంభించనుంది. ఈ సేల్‌లో ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్ సహా వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ డిస్కౌంట్స్
Flipkart Big Billion Days Offers :
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌పై 10 శాతం వరకు డిస్కౌంట్ కల్పించనుంది.
- ఈ సేల్‌లో పేటీఎం కూడా గ్యారెంటీడ్ సేవింగ్స్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా పేటీఎం వాలెట్, యూపీఐ ద్వారా పేమెంట్స్ చేస్తే కచ్చితంగా మంచి డిస్కౌంట్ అందించనున్నట్లు స్పష్టం చేసింది.
- ఒక వేళ మీ దగ్గర సమయానికి డబ్బు లేకపోయినా చింతించాల్సిన పని లేదు. 'ఫ్లిప్‌కార్ట్ పే లేటర్' ఫీచర్ ఉపయోగించి.. ముందుగా మీకు నచ్చిన వస్తువును కొనుగోలు చేయవచ్చు. తరువాత నిర్దిష్ట సమయంలోపు మీరు ఫ్లిప్‌కార్ట్‌కు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
- పాత డివైజ్‌లను ఎక్స్ఛేంజ్ చేస్తే.. మంచి డిస్కౌంట్ సహా, మంత్లీ నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ - స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్స్
Flipkart Big Billion Days Discounts :
- ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించనున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐఫోన్ డిస్కౌంట్స్ గురించి అక్టోబర్ 1న తెలియజేయస్తామని వెల్లడించింది.
- అక్టోబర్ 3న శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్స్ గురించి, అక్టోబర్ 5న పిక్సెల్ ఫోన్ డీల్స్ గురించి, అక్టోబర్ 7న షావోమీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల గురించి ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది.
- ఫ్లిప్‌కార్ట్ ఇతర ముఖ్యమైన ప్రొడక్టులపై అందించే డిస్కౌంట్స్, ఆఫర్స్ గురించి కస్టమర్లు మరికొంత కాలం వేచిచూడాల్సి ఉంటుంది.
80% డిస్కౌంట్
- ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో.. యాపిల్, శాంసంగ్, గూగుల్, రియల్మీ, ఒప్పో, షావోమీ, నథింగ్, వివో ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ అందించే అవకాశముందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
- మోటో జీ54 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ, రియల్మీ సీ51, రియల్మీ 11 5జీ, రియల్మీ 11ఎక్స్ 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 5జీ, మోటో జీ84 5జీ, వివో వీ29ఈ, పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్లపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది ఫ్లిప్‌కార్ట్. తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవాలని అనుకునేవారికి.. ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.