తెలంగాణ

telangana

ETV Bharat / business

చిత్రా రామకృష్ణకు రూ.3.12 కోట్ల నోటీస్‌.. 15 రోజుల్లోగా చెల్లించకుంటే అరెస్ట్​! - చిత్రా రామకృష్ణ

Chitra ramkrishna ED statement: ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చిత్రా రామకృష్ణకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ నోటీసు పంపింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పాలనా పరమైన అవకతవకలకు సంబంధించిన కేసులో రూ.3.12 కోట్లు కట్టాలని విఫలమైతే అరెస్ట్​ చేయాలంటూ ఆదేశాలిచ్చింది.

chitra ramkrishna ed statement
chitra ramkrishna ed statement

By

Published : May 25, 2022, 8:56 AM IST

Chitra ramkrishna ED statement: స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పాలనా పరమైన అవకతవకలకు సంబంధించిన కేసులో రూ.3.12 కోట్లు కట్టాలంటూ ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చిత్రా రామకృష్ణకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ నోటీసు పంపింది. 15 రోజుల్లోగా చెల్లింపులు జరపడంలో విఫలమైతే అరెస్టుకు ఆదేశాలిచ్చింది. దీంతో పాటు ఆస్తుల, బ్యాంకు ఖాతాల అటాచ్‌మెంట్‌ జరుగుతుందని హెచ్చరించింది. ఎన్‌ఎస్‌ఈకి చిత్ర కంటే ముందు అధిపతిగా వ్యవహరించిన రవి నరేన్‌, సుబ్రమణియన్‌, ఇతరులపైనా అపరాధ రుసుమును సెబీ గతంలో విధించింది. ప్రస్తుతం చిత్రా రామకృష్ణ దిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నారు. ఎన్‌ఎస్‌ఈ కో-లొకేషన్‌ కుంభకోణం కేసులో, ఎక్స్ఛేంజీలో పాలనాపరమైన అవకతవకలపై దర్యాప్తునకు సంబంధించి మార్చి 6న సీబీఐ ఆమెను అరెస్టు చేసింది.

రామకృష్ణ స్టేట్‌మెంట్‌ తీసుకున్న ఈడీ:ఇటీవల చిత్రా రామకృష్ణ స్టేట్‌మెంట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రికార్డు చేసింది. చిత్ర, ఇతరులపై మనీ లాండరింగ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. 'రెండు సందర్భాల్లో ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. నగదు అక్రమ బదిలీ నిరోధ చట్టం(పీఎమ్‌ఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద ఇది జరిగింద'ని వారు వివరించారు.

ఇదీ చదవండి:వంటగదికి తీపి కబురు.. వంటనూనెల దిగుమతులపై సుంకాల తొలగింపు!

ABOUT THE AUTHOR

...view details