తెలంగాణ

telangana

ETV Bharat / business

Dormant Demat Account : మీ డీమ్యాట్ అకౌంట్​​.. 'ఇన్​యాక్టివ్​'గా మారిందా?.. అయితే ఈ ఆర్థిక ఇబ్బందులు తప్పవు! - how to reactivate dormant account online

Dormant Demat Account : మీకు డీమ్యాట్ అకౌంట్​ ఉందా? దానిని చాలా కాలం నుంచి ఉపయోగించడం లేదా? అయితే దానిని స్టాక్​ బ్రోకింగ్ సంస్థలు 'ఇన్​యాక్టివ్ అకౌంట్' లేదా 'డోమెంట్ ఖాతా'గా పరిగణించే అవకాశం ఉంది. దీని వల్ల అనేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Dormant Demat Account Disadvantages
Dormant Demat Account

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 2:57 PM IST

Dormant Demat Account : డీమ్యాట్ అకౌంట్​ అనేది ఒక డిజిటల్ వాలెట్ లాంటిది. దీనిలో స్టాక్స్​,బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ సహా పలు సెక్యూరిటీలు ఎలక్ట్రానిక్​ ఫామ్​లో ఉంటాయి. ​ఈ డీమ్యాట్​ అకౌంట్ ద్వారా మాత్రమే మీరు ఈక్విటీ షేర్లు కొనడం, అమ్మడం లాంటి చేయగలుగుతారు.

డోమెంట్​ అకౌంట్ అంటే ఏమిటి?
What Is A Dormant Demat Account :ఒక డీమ్యాట్​ అకౌంట్ చాలా కాలంపాటు నిష్క్రియాత్మకంగా ఉంటే.. అప్పుడు దానిని 'నిద్రాణంగా' (Dormant) ఉన్న ఖాతాగా పరిగణిస్తారు. కొన్ని బ్రోకరేజీ సంస్థలు 11 నెలలు నుంచి 3 సంవత్సరాల కాలావధుల్లో.. నిష్క్రియంగా ఉన్న ఖాతాలను 'డోమెంట్​ అకౌంట్స్​'గా పరిగణిస్తాయి. మరి కొన్ని సంస్థలు 5 ఏళ్ల కాలపరిమితి దాటిన వాటిని డోమెంట్ ఖాతాలుగా నిర్ణయిస్తాయి.

డీమ్యాట్ అకౌంట్​.. డోమెంట్ అకౌంట్​గా ఎందుకు మారుతుంది?
Why Do Demat Accounts Become Dormant :చాలా మంది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత.. షేర్స్​ కొనడంగానీ, అమ్మడంగానీ చేయరు. అలాగే ఆ డీమ్యాట్​ ఖాతా ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కూడా జరపరు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవి ఏమిటంటే..

  • మీ పెట్టుబడి ప్రణాళిక మారవచ్చు : కొంత మంది లాంగ్​ టెర్మ్ ఇన్వెస్ట్​మెంట్​పై దృష్టిపెడతారు. అందుకే ఒకేసారి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి, తరువాత దానిని మరిచిపోతారు. మరికొందరు స్టాక్ మార్కెట్​ లాంటి రిస్కీ ఇన్వెస్ట్​మెంట్ వద్దు అనుకుని.. వేరే సేఫ్టీ మార్గాల్లోకి పెట్టుబడులను మళ్లిస్తారు. దీని వల్ల సదరు డీమ్యాట్ అకౌంట్ అనేది నిద్రాణమైన ఖాతాగా (డోమెంట్​) మారిపోతుంది.
  • మీ ఆర్థిక లక్ష్యాలు మారిపోవచ్చు : జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో.. ఎవరూ చెప్పలేరు. కుటుంబ బాధ్యతలు పెరిగిన తరువాత పెట్టుబడుల కంటే.. రోజువారీ ఆర్థిక అవసరాలపై దృష్టి నిలపాల్సి వస్తుంది. ముఖ్యంగా నిత్యావసరాలు, విద్య, వైద్యం సహా అన్ని గృహ ఖర్చులు పెరిగిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్​ మార్కెట్​పై దృష్టి పెట్టడం కష్టమైపోతుంది.
  • నిర్లక్ష్యం : కొందరు మొదట్లో ఉన్న ఉత్సాహం తరువాత చూపరు. ముఖ్యంగా స్టాక్​ మార్కెట్​ పెట్టుబడుల విషయంలో మొదట్లో చూపిన ఉత్సాహం.. తరువాత చూపరు. కొందరు సమయం లేక, మరి కొందరు నిర్లక్ష్యంతో.. తమ డీమ్యాట్ అకౌంట్​లను పట్టించుకోరు. దీని వల్ల కూడా వారి ఖాతాలు డోమెంట్ అకౌంట్స్​గా మారిపోతుంటాయి.​

పెట్టుబడుల పరిస్థితి ఏమిటి?
Financial Impact on Inactive Demat Account :మీ డీమ్యాట్ అకౌంట్​ పొరపాటున డోమెంట్ అకౌంట్​గా మారిపోయినప్పటీ.. మీరేమీ చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీ పెట్టుబడులు ఏమీ మాయమైపోవు. అవి సురక్షితంగానే ఉంటాయి. అలాగే మీ క్రెడిట్ స్కోర్​పై కూడా ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ పడదు. కానీ కొన్ని ఆర్థిక పరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఛార్జీలు కట్టాల్సిందే : స్టాక్​ బ్రోకరేజీ సంస్థలు మీ డీమ్యాట్​ అకౌంట్​పై ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా యాన్యువల్ మెయింటెన్స్ ఛార్జీలు, ట్రాన్సాక్షన్​ ఫీజులు వసూలు చేస్తుంటాయి. డోమెంట్ ఖాతాలపైనా ఈ ఛార్జీలు విధించడం జరుగుతుంది. దీని వల్ల మీపై అనవసర ఆర్థిక భారం పడుతుంది.
  • అవకాశాలు కోల్పోతారు :మార్కెట్​లో ఎప్పుడూ యాక్టివ్​గా ఉండాలి. లేదంటే మంచి ఆదాయం సంపాదించే అవకాశాలు కోల్పోతారు.
  • వారసులకు దగ్గకపోవచ్చు : చాలా మంది స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. కానీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు లేదా వారసులకు తెలియజేయరు. అందువల్ల దురదృష్టవశాత్తు సదరు పెట్టుబడిదారుడు మరణిస్తే.. అతని డీమ్యాట్ అకౌంట్​ అనేది డోమెంట్ అకౌంట్​గా మారిపోతుంది.

డీమ్యాట్​.. డోమెంట్ అకౌంట్​గా మారకుండా ఉండాలంటే ఏమి చేయాలి?
మీ డీమ్యాట్ అకౌంట్​ నిద్రాణమైన (డోమెంట్​) ఖాతాగా మారకుండా ఉండాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. రెగ్యులర్ రివ్యూ : మీరు క్రమం తప్పకుండా మీ డీమ్యాట్ ఆకౌంట్​ను రివ్యూ చేస్తూ ఉండాలి. కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా మీ ఖాతాను పూర్తిగా పరిశీలించాలి. మీ పెట్టుబడులను, మార్కెట్ పరిస్థితిలను సమీక్షించుకోవాలి. దీని వల్ల మీ డీమ్యాట్ ఖాతా యాక్టివ్​గా ఉండడమే కాదు. మీ పెట్టుబడుల ప్రణాళికను, వ్యూహాన్ని సమయానికి అనుకూలంగా మార్చుకోవడానికి వీలవుతుంది.
  2. సమాచారం తెసుకోవాలి : స్టాక్ మార్కెట్ అనేది చాలా డైనమిక్​గా ఉంటుంది. కనుక మార్కెట్​ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దీని వల్ల సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసి, మంచి లాభాలను పొందే అవకాశం ఏర్పడుతుంది. ఒక వేళ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. అందుకు అనుగుణంగా మీ పోర్టుఫోలియోను కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
  3. సెట్​ రిమైండర్స్​ : పని ఒత్తిడి వల్ల చాలా సార్లు మనం పెట్టుబడుల గురించి మరిచిపోతూ ఉంటాం. కనుక మీ ఫైనాన్సియల్ యాప్​లో, అలాగే మీ క్యాలెండర్​లోనూ కచ్చితంగా ఫైనాన్సియల్​ రిమైండర్స్​ను సెట్​ చేసుకోవాలి.
  4. ఆర్థిక నిపుణులను సంప్రదించాలి :ఒక వేళ మీకు ఆర్థిక విషయాలపై సరైన అవగాహన లేకపోతే.. కచ్చితంగా ఒక మంచి సర్టిఫైడ్​ ఫైనాన్సియల్ ఎడ్వైజర్​ను సంప్రదించాలి.
  5. కన్సాలిడేట్​ అకౌంట్స్​ : మీకు ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే.. కచ్చితంగా వాటిని అనుసంధానం లేదా ఏకీకృతం చేయాలి. దీని వల్ల మీ పెట్టుబడులను చాలా సులువుగా మేనేజ్ చేసుకోవడానికి వీలవుతుంది.
  6. ఆర్థిక లావాదేవీలు తప్పనిసరి : కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా షేర్స్ కొనడం లేదా అమ్మడం చేయాలి. దీని వల్ల మీ డీమ్యాట్ అకౌంట్​ యాక్టివ్​గా ఉంటుంది.

నోట్​ : ఈ ఆర్టికల్​లో చెప్పిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏమైనా సందేహాలు ఉంటే.. మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది.

How Much Money You Can Withdraw from PF : ఉద్యోగంలో ఉండగానే పీఎఫ్ విత్​డ్రా చేసుకోవచ్చు... ఎంత శాతమో తెలుసా?

How To Change Mobile Number In SBI : SBI బ్యాంక్​లో ఫోన్​ నంబర్​ మార్చుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి!

ABOUT THE AUTHOR

...view details