తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ ఏడాది వేతనాల్లో 10% పెంపు, ఆసియా పసిఫిక్​లోనే అత్యధికం - సాలరీ బడ్జెట్ ప్లానింగ్​

ఆసియా పసిఫిక్​లోనే అత్యధిక వేతనాలు చెల్లించే దేశంగా భారత్​ నిలవబోతుంది. భారత్‌లోని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం 10 శాతం మేర వేతన పెంపును చేపట్టవచ్చని అంతర్జాతీయ సలహా, బ్రోకరేజీ కంపెనీ విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ చేపట్టిన శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌ నివేదిక అంచనా వేస్తోంది.

SALARY REPORT
SALARY REPORT

By

Published : Aug 17, 2022, 7:04 AM IST

భారత్‌లోని కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం 10 శాతం మేర వేతన పెంపును చేపట్టవచ్చని ఒక నివేదిక అంచనా వేస్తోంది. వలసలు పెరుగుతుండడం వల్ల సిబ్బంది లభ్యత కష్టంగా మారడం ఇందుకు నేపథ్యమని అంతర్జాతీయ సలహా, బ్రోకరేజీ కంపెనీ విలిస్‌ టవర్స్‌ వాట్సన్‌ చేపట్టిన 'శాలరీ బడ్జెట్‌ ప్లానింగ్‌' నివేదికలో వెల్లడైంది. 168 దేశాల్లోని 590 కంపెనీలపై ఏప్రిల్‌-మే 2022లో జరిపిన సర్వే ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ప్రకారం..

  • 2021-22లో పెరిగిన 9.5 శాతం వేతనాలతో పోలిస్తే 2022-23లో అంతకంటే ఎక్కువగా 10 శాతం మేర భారత్‌లో జీతాలు పెరగొచ్చు.
  • గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగం కంపెనీలు పైగా(58%) అధిక వేతనాల పెంపునకు బడ్జెట్‌ను కేటాయించాయి.
  • ఇక పావు వంతు(24.4%) మాత్రం యథాతథ బడ్జెట్‌ను కొనసాగించనున్నాయి.
  • కేవలం 5.4 శాతం సంస్థలు మాత్రం 2021-22తో పోలిస్తే కాస్త బడ్జెట్‌ను తగ్గించుకుంటున్నాయి.
  • భారత్‌లో నమోదుకానున్న 10 శాతం వేతన పెంపు ఆసియా పసిఫిక్‌(ఏపీఏసీ) ప్రాంతంలోనే అత్యధికం కావడం విశేషం.
  • భారత్‌తో పోలిస్తే చైనా(6%), హాంకాంగ్‌(4%), సింగపూర్‌(4%)లు తక్కువ పెంపునే చేపడుతున్నాయి.
  • భారత్‌లోని 42 శాతం మేర కంపెనీలు వచ్చే 12 నెలల్లో సానుకూల ఆదాయ అంచనాలను అంచనా వేశాయి. కేవలం 7.2 శాతం మాత్రమే ప్రతికూల అంచనాలను వెలువరిచాయి.

వీటిలో నియామకాలు..:ఐటీ (65.5%), ఇంజినీరింగ్‌(52.9%), విక్రయాలు(35.4%), సాంకేతిక నైపుణ్యం(32.5%), ఆర్థిక(17.5%) విభాగాల్లో వచ్చే 12 నెలల్లో నియామకాలు జరగనున్నాయి. స్వచ్ఛంద వలసల రేటు సైతం ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో హాంకాంగ్‌ తర్వాత అత్యధికంగా 15.1 శాతంగా కొనసాగనుంది. ఇక ఆర్థిక సేవలు, బ్యాంకింగ్‌-సాంకేతికత, మీడియా-గేమింగ్‌ రంగాల్లో వరుసగా 10.4%, 10.2%, 10 శాతం చొప్పున వేతన పెంపులు కనిపించొచ్చని ఆ సర్వే అంటోంది.

ABOUT THE AUTHOR

...view details