BGauss C12i Max Electric Scooter Price : ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ విపరీతంగా దూసుకుపోతోంది. దీంతో.. తమ మార్క్ చూపించడానికి వివిధ కంపెనీలు కొత్త ఈవీ మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ ఉపకరణాల పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన BGauss ఇటీవల అదిరిపోయే ఫీచర్లతో మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను(Electric Scooter) మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంత.. ఆ స్కూటర్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
BGauss Launched New Electric Scooter C12i Max :మార్కెట్‌లోకి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు BGauss C12i Max. ఇది BGauss తీసుకొచ్చిన నాలుగో రకం ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ప్రారంభ ధర రూ. 1,04,999(ఎక్స్-షోరూమ్, FAME 2, రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి). అలాగే కంపెనీ దీనిపై ప్రారంభ తగ్గింపును అందిస్తోంది. దీంతో ఎక్స్-షోరూమ్ ధరను రూ. 97,999కి తగ్గించింది(పరిచయ ఆఫర్, స్టాక్స్ చివరి వరకు చెల్లుబాటు అవుతుంది). దిల్లీ(Delhi)లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,26,153 గా ఉంది. ఇన్సూరెన్స్ రూ. Rs.4,717తో On-Road Price 1,30,870 రూపాయలుగా ఉంది. BGauss C12i మాక్స్ స్కూటర్లు బ్లూ, గ్రే, రెడ్, వైట్, ఎల్లో.. మొత్తం 5 రంగులలో లభిస్తున్నాయి. ఈ కొత్త స్కూటర్(New Scooter)ఆకట్టుకునే రేంజ్, స్టైలిష్ డిజైన్‌తో పాటు సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవంతో మార్కెట్లోకి వచ్చింది.
Upcoming EV Scooters : అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే.. ఓ లుక్కేయండి!
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లోని ఫీచర్లు ఇవే :