Best Mileage Cars Under 10 Lakh : భారతీయులు చాలా మంది తక్కువ బడ్జెట్లో, మంచి మైలేజ్ ఇచ్చే కార్ కొనాలని ఆశపడుతూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే.. ఫ్యూయెల్ ఎఫీషియన్సీ ఉన్న కార్లను రూపొందిస్తున్నాయి. వాటిలో టాప్-10 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతి డోమినేషన్
తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కార్లను రూపొందించడంలో.. భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి నంబర్ వన్ స్థానంలో ఉందంటే.. అది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. మారుతి సుజుకి పెట్రోల్ ఇంజిన్ కార్లను మాత్రమే కాదు.. దాదాపు తమ అన్ని కార్లలోనూ సీఎన్జీ పవర్ట్రైన్ ఆప్షన్లను అందిస్తూ ఉంటుంది. కనుక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కారు కొనాలంటే.. మారుతి సుజుకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది.
సూపర్ మైలేజ్
ARAI రేటింగ్స్ ప్రకారం, మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ MT లీటర్కు 25.17 మైలేజ్, పెట్రోల్ AMT లీటర్కు 26.23 కి.మీ మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ వేరియంట్ కారు 34.43km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో, మంచి మైలేజ్ ఉన్న డీజిల్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మైలేజ్ విషయంలో సీఎన్జీ కారుతో పోల్చి చూస్తే.. ఈ డీజిల్ కారే బెస్ట్ ఆప్షన్ అని అవుతుంది.
సూపర్ మైలేజ్ ఇచ్చే టాప్-10 కార్స్!
Top 10 Super Mileage Cars :
1. Maruti Celerio Mileage :
- మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ MT వేరియంట్ 25.17 kmpl మైలేజ్ ఇస్తుంది.
- మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ AMT వేరియంట్ మైలేజ్ 26.23 kmpl వరకు ఉంటుంది.
- మారుతి సుజుకి సెలెరియో CNG వేరియంట్ 34.43 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
2. Maruti WagonR Mileage :
- మారుతి వ్యాగన్-ఆర్ 1.0 పెట్రోల్ MT వేరియంట్ 25.17 kmpl మైలేజ్ ఇస్తుంది.
- మారుతి వ్యాగన్-ఆర్ 1.0 పెట్రోల్ AMT వేరియంట్ మైలేజ్ 25.19 kmpl వరకు ఉంటుంది.
- మారుతి వ్యాగన్-ఆర్ 1.2 పెట్రోల్ MT వేరియంట్ 23.56 kmpl మైలేజ్ ఇస్తుంది.
- మారుతి వ్యాగన్-ఆర్ 1.2 పెట్రోల్ AMT వేరియంట్ మైలేజ్ 24.43 kmpl ఉంటుంది.
- మారుతి వ్యాగన్-ఆర్ CNG వేరియంట్ 34.05 Km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.
3. Maruti S Presso Mileage :
- మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ MT వేరియంట్ 24.12 kmpl మైలేజ్ ఇస్తుంది.
- మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్ AMT వేరియంట్ మైలేజ్ 25.3 kmpl వరకు ఉంటుంది.
- మారుతి ఎస్-ప్రెస్సో CNG వేరియంట్ 32.73 km/kg ఫ్యూయెల్ ఎఫీషియన్సీ కలిగి ఉంది.