Best Cashback Offers on Credit Cards : ఏదైనా పండుగ సీజన్ వస్తే చాలు ఈ- కామర్స్ సంస్థలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు రకాల ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అలాగే బ్యాంకులు కూడా క్రెడిట్‌కార్డ్ వినియోగదారుల కోసం అదిరిపోయే క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందిస్తున్నాయి.
ఎస్బీఐ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్
Cashback SBI Credit Card Benefits :
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందించే ఈ క్యాష్‌బ్యాక్ కార్డ్‌తో ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఆఫ్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌పై 1 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఒకవేళ మీరు ఒక నెలలో ఆన్లైన్లో రూ.20,000, మిగిలిన రూ.80,000 ఆఫ్‌లైన్‌లో ఖర్చు చేస్తే మొత్తంగా రూ.21,600 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
హెచ్డీఎఫ్సీ మిలీనియా క్రెడిట్ కార్డు
HDFC Millenia Credit Card Benefits :ఈ క్రెడిట్ కార్డుతో అమెజాన్, బుక్ మై షో, కల్ట్‌ఫిట్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, సోనీ లీవ్, స్వీగ్గీ, ఉబర్, జొమాటో లాంటి సైట్లలో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు, ఇతర ఖర్చులపై 1% వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ప్రతినెలా రూ.20 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు చేస్తే వార్షిక క్యాష్‌బ్యాక్ రూ.21,600 వరకు లభిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ ఏసీఈ క్రెడిట్ కార్డ్
Axis Bank ACE Credit Card Benefits :ఈ క్రెడిట్ కార్డుతో చేసే బిల్ పేమెంట్లపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. స్విగ్గీ, జొమాటో, ఓలా యాప్‌ల్లో చేసే ఖర్చులపై 4 శాతం, ఇతర ఖర్చులపై 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలానే ప్రతి నెలా బిల్ పేమెంట్లపై రూ.10 వేల వరకు ఖర్చు చేస్తే 4శాతం, ఇతర ఖర్చులపై రూ.90 వేల వరకు వినియోగిస్తే, సంవత్సరానికి క్యాష్‌బ్యాక్ కింద రూ.20,400 వరకు వస్తుంది.