Best Business Ideas Under Low Cost: మనిషికి డబ్బు చాలా అవసరం. జీవితానికి అది పెట్రోల్ వంటిది. అది లేకపోతే.. బతుకు బండి ముందుకు కదలదు. మరి, దానికోసం ఏం చేయాలి.. అన్నప్పుడు మెజారిటీ జనం చెప్పే మాట మంచి ఉద్యోగం. కానీ.. ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే.. వ్యాపారం ఎంత చిన్నదైనా స్వాతంత్రమే అనే సూత్రాన్ని బలంగా నమ్మేవారు కొందరు ఉంటారు. అలాంటి వారు ఉద్యోగాలు మానేసి.. బిజినెస్ చేయాలని చూస్తుంటారు. కానీ.. దీనికి మొదటగా కావాల్సింది పెట్టుబడి. అది లేకనే వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారిలో మీరు కూడా ఉన్నారా.. అయితే.. మీకోసమే తక్కువ పెట్టుబడితో బిజినెస్ మొదలు పెట్టే ఐడియాలను తీసుకొచ్చాం. ఈ వ్యాపారాలను కేవలం 50వేల రూపాయలతో ప్రారంభిచవచ్చు. మరి అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
టిఫిన్ లేదా ఫుడ్ డెలివరీ సేవలు(Tiffin or Food Delivery Services): ప్రస్తుత రోజుల్లో తొందరగా స్టార్ట్ చేసే వ్యాపారం అంటే ఫుడ్ బిజినెస్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో వండటానికి ఇష్టపడటం లేదు. టైమ్ అడ్జెస్ట్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో.. బయటికి వెళ్లినప్పుడు తినడమో.. లేదంటే ఆర్డర్ పెట్టుకోవడమో చేస్తున్నారు. ఈ రెండు పాయింట్లను ఆధారంగా చేసుకుని టిఫిన్ అండ్ ఫుడ్ డెలివరీ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తే.. లాభదాయకంగా ఉంటుంది. దీనికి కేవలం 50వేల రూపాయల లోపు పెట్టుబడి సరిపోతుంది. అలాగే ఈ వ్యాపారాన్ని జన సముదాయం ఎక్కువ ఉన్న ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల బిజినెస్ కూడా సక్సెస్ అవుతుంది.
ఫుడ్ స్టాల్స్ లేదా ఫుడ్ ట్రక్కులు(Food Stalls or Food Trucks): ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన బిజినెస్ ఫుడ్ ఆన్ వీల్స్. వీటిని ఎక్కడైనా పార్క్ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందడానికి వీలుంటుంది. చాలా మంది సాయంత్రం పూట స్నాక్స్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు, వివిధ రకాల చాట్‌లు లేదా ఇతర స్ట్రీట్ ఫుడ్స్ వంటి వాటిని ఇష్టపడతారు. ఫాస్ట్‌పుడ్ కోసం రెస్టారెంట్లకు వెళ్లలేక ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి తీసుకుంటారు. వారు ఫ్యాన్సీ రెస్టారెంట్ కంటే ఫుడ్ స్టాల్స్ నుంచి కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి ఫుడ్ ట్రక్కుల ద్వారా బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి లాభం ఉంటుంది.
జామ్ అండ్ ఊరగాయ తయారీ(Jam and Pickle Making): భారతదేశంలోని దాదాపు ప్రతి కుటుంబానికి ఊరగాయలు అవసరం. రోజు కూరగాయలతో తినే వారికి పచ్చళ్లతో తినాలని అనిపిస్తుంది. అయితే.. ఇంట్లో ఊరగాయ తయారు చేసే తీరిక చాలా మందికి ఉండదు. అందుకే.. చాలా మంది వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం.. లేదా కిరాణా దుకాణాల నుంచి కొనుగోలు చేయడం వంటివి చేస్తున్నారు. అందువల్ల.. ఊరగాయ తయారుచేసే వ్యాపారం పెట్టవచ్చు. ఇక, చాలా కంపెనీలు తాజా జామ్‌లు లేదా ఆర్గానిక్ జామ్‌లను తయారు చేస్తున్నాయి. సో.. జామ్ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతోంది. ఈ రెండిటినీ 50వేల లోపే ప్రారంభించవచ్చు. ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు.
వెడ్డింగ్ ప్లానర్లు లేదా ఈవెంట్ మేనేజర్లు(Wedding Planners or Event Managers): ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని చాలా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటారు. అందుకోసం చాలా మంది వెడ్డింగ్ ప్లానర్లు లేదా ఈవెంట్ మేనేజర్లను కలుస్తారు. ఈ బిజినెస్‌ను 50 వేల లోపు ప్రారంభించవచ్చు. క్లయింట్ అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా ఈ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయడానికి.. అలాగే ఇంకా ఎక్కువ విస్తరించడానికి వీలుంటుంది. వెడ్డింగ్ ప్లానర్ ప్రతిభావంతులైన సభ్యులతో ఒక ఖచ్చితమైన గ్రూప్‌ను తయారు చేయగలిగితే అది వ్యాపారానికి ఎంతో ఉపయోగపడుతుంది.