Ather 450S Scooter Launch : ఏథర్ కంపెనీ శుక్రవారం భారత మార్కెట్లో 3 సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేసింది. వీటిలో ఒకటి ఏథర్ 450ఎస్ సరికొత్త మోడల్ కాగా, ఏథర్ 450ఎక్స్ రివైజ్డ్ వెర్షన్ స్కూటర్లు రెండు ఉన్నాయి.
ఏథర్ 450ఎస్ స్కూటర్ ఫీచర్స్
Auther 450S Scooter Features :ఏథర్ నయా 450ఎస్ స్కూటర్.. ఓలా ఎస్1 ఎయిర్‌కు పోటీగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.9 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీ ఉంది. ఇది 115 కి.మీ ఐడీసీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ ఏథర్ 450 ఎస్ స్కూటర్ కేవలం 3.9 సెకెన్లలోనే 0 నుంచి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.
ఏథర్ 450ఎస్ స్కూటర్లో.. డీప్‌వ్యూ డిస్ప్లే, న్యూ స్విచ్‌గేర్, ఫాల్‌సేఫ్ ఫీచర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ఈఎస్ఎస్), కోస్టింగ్ రీజెన్ ఉన్నాయి. ఇందులో అమర్చిన గ్రిడ్ ఫాస్ట్ ఛార్జర్ వల్ల 1.5 కి.మీ/మినిట్ వేగంతో బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
Auther 450S Pro Pack :ఏథర్ 450 ఎస్తో పాటు వినియోగదారులు ప్రో ప్యాక్‌ను కూడా తీసుకోవచ్చు. ఈ ప్రో ప్యాక్ ద్వారా రైడ్ అసిస్ట్, ఏథర్ బ్యాటరీ ప్రొటెక్షన్, ఏథర్ స్టేక్ అప్డేట్స్, ఏథర్ కనెక్ట్ ఫీచర్లను పొందవచ్చు.
ఏథర్ 450ఎస్ స్కూటర్ ధర
Auther 450S Scooter Price : ఈ ఏథర్ 450 ఎస్ స్కూటర్ ధరను రూ.1,29,999లుగా కంపెనీ నిర్ణయించింది. ఇది ఏథర్ 450 ఎక్స్ కంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుందని, అలాగే దీనిలో మంచి భద్రతా ఫీచర్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది.