తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​ ప్రైమ్​ యూజర్స్​కు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు - భారత్​లో పెరిగిన అమెజాన్​​ ప్రైమ్ రేట్స్​

అమెజాన్​ ప్రైమ్​ కస్టమర్ల​కు చేదు కబురు వినిపించింది అమెజాన్​ కంపెనీ. మంథ్లీ, క్వార్టర్లీ టారిఫ్​ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Amazon Prime Subscription Hiked Again in India
అమెజాన్​ ప్రైమ్​ యూజర్స్​కు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు

By

Published : Apr 26, 2023, 7:11 PM IST

Updated : Apr 26, 2023, 8:17 PM IST

అమెజాన్​ ప్రైమ్​ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది అమెజాన్​ సంస్థ. ప్లాట్​ఫామ్​ యాక్సెస్​ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది అమెజాన్. ప్రస్తుతం ఉన్న ధరలను భారీగా పెంచింది. దేశంలో అత్యంత జనాదరణ పొందిన ఓటీటీ ప్లాట్​ఫామ్​లలో ఒకటైన అమెజాన్​ ప్రైమ్​.. అందులోని ప్రైమ్ వీడియో, ఆడిబుల్, ప్రైమ్ మ్యూజిక్ వంటి అనేక సేవలందిస్తున్న​ ప్లాట్​ఫామ్​లపై భారీగా సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలను పెంచింది. నెలవారీ, త్రైమాసిక సబ్​స్క్రిప్షన్స్​ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది.

ఒకేసారి నెలవారీ, క్వార్టర్లీ ఛార్జీలపై దాదాపు 65%, 30% మేర ధరలను పెంచేసింది అమెజాన్​ ప్రైమ్​. ప్రస్తుతం ఉన్న వార్షిక ప్లాన్‌ కొనుగోళ్ల శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే తక్కువ వ్యవధి కలిగిన నెల, మూడు నెలల సబ్​స్క్రిప్షన్స్​ ఛార్జీలను పెంచినట్లు తెలిసింది. ఇంతకుముందు 2021 చివర్లో కూడా టారిఫ్​ ఛార్జీలను పెంచింది అమెజాన్​ ప్రైమ్​. ఇక తాజాగా పెంచిన ధరలతో మిడిల్​ క్లాస్​ యూజర్స్​పై మరింత భారం తప్పదంటున్నారు మార్కెట్​ నిపుణులు.

భారతదేశంలో కొత్త అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్స్​ ధరలిలా ఉన్నాయి.

ప్రైమ్​ మెంబర్​షిప్​ కొత్త ధర​ పాత ధర​
నెల ప్లాన్ రూ.299 రూ.179
మూడు నెలల ప్లాన్ రూ.599 రూ.459
ఏడాది ప్లాన్ రూ.1499 రూ.1499

మరో ఓటీటీ ప్లాట్​ఫామ్​ అయిన నెట్​ఫ్లిక్స్​లో సబ్​స్క్రిప్షన్​ ఛార్జీలిలా ఉన్నాయి.

  1. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్
    కేవలం రూ.149లకే నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ అందుబాటులో ఉంది. రూ.1,788 తో వార్షిక ప్లాన్​ కూడా ఉంది. ఈ ప్లాన్​తో మీ ఆండ్రాయిడ్​, ఐ-ఫోన్​ల్లో మీకు నచ్చిన షోలు, సినిమాలు, వెబ్​ సిరీస్​లను చూసేయచ్చు. అంతేకాకుండా మీ ల్యాప్​టాప్​, స్మార్ట్​ టీవీలు, అమెజాన్ ఫైర్ టీవీ వంటి గ్యాడ్జెట్స్​ల్లో ఏదైనా ఒక స్కీన్​లో ఈ నెట్‌ఫ్లిక్స్ మొబైల్​ ప్లాన్​ను ఆస్వాదించొచ్చు.
  2. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్
    నెలకు రూ.199లు సంవత్సరానికి రూ.2,388ల బేసిక్​ ప్లాన్​ సేవలు కూడా నెట్​ఫ్లిక్స్​లో ఓటీటీ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్యాకేజీలో ఉండే సమానమైన ప్రయోజనాలు ఈ నెట్‌ఫ్లిక్స్ బేసిక్​ ప్లాన్​లో​నూ ఉంటాయి. ఈ ప్లాన్​తో ల్యాప్​టాప్​, స్మార్ట్​ టీవీలలో కూడా మీకు నచ్చిన కంటెంట్​ను ఎంజాయ్​ చేయొచ్చు.
  3. నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్​
    మీరు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో నెట్‌ఫ్లిక్స్‌ను ఎంజాయ్​ చేయాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్ మీకు మంచి అవకాశం కల్పిస్తోంది. పూర్తి HD రెజల్యూషన్​ కలిగిన వీడియోలను డౌన్​లోడ్​ చేసుకొని ఒకేసారి రెండు గ్యాడ్జెట్స్​లో కావాల్సిన కంటెంట్​ను వీక్షించొచ్చు. ఇందుకోసం నెలకు రూ.499 లేదా సంవత్సరానికి రూ.5,988ల ప్యాకేజీలు కస్టమర్లకు అందుబాటులో ఉంచింది నెట్​ఫ్లిక్స్​.
Last Updated : Apr 26, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details