తెలంగాణ

telangana

ETV Bharat / business

చిరువ్యాపారుల ఫేవరెట్​ 'లూనా' ఈజ్​ బ్యాక్​.. 'ఈ-బైక్​'గా మళ్లీ మార్కెట్​లోకి.. - luna electric scooter

Luna Electric Scooter : చిరువ్యాపారులకు ఎంతో ఇష్టమైన ద్విచక్ర వాహనం 'లూనా'.. 'ఈ-బైక్'​గా మళ్లీ మార్కెట్​లోకి రానుంది. ఈ ఏడాదే అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

eluna is coming
luna is coming back in an electric avatar

By

Published : Jun 1, 2023, 5:34 PM IST

Updated : Jun 1, 2023, 5:39 PM IST

Luna Electric Scooter : ద్విచక్ర వాహన​ ప్రియులకు, ముఖ్యంగా చిరువ్యాపారులకు ఎంతో ఇష్టమైన 'లూనా' త్వరలోనే ఎలక్ట్రిక్​ లూనాగా (ఈ-లూనా) మార్కెట్​లోకి రానుంది. ఈ విషయాన్ని 'కెనెటిక్​ గ్రీన్​' సంస్థ ప్రకటంచింది. ఆ​ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ సులాజా ఫిరోదియా మొత్​వానీ త్వరలోనే ఈ-లూనాను మార్కెట్​లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒరిజినల్​ 'లూనా'లానే ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

టీవీఎస్​కు పోటీగా!
Luna E Bike Launch : ప్రస్తుతం మార్కెట్​లో దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం 'టీవీఎస్​ ఎక్స్​ఎల్​ 100'కు ఇది మరో ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం కెనెటిక్​ గ్రీన్​ సంస్థ మార్కెట్​లోకి ప్రవేశపెడుతున్న 'ఈ-లూనా'.. పెర్ఫార్మెన్స్​, రేంజ్​ విషయంలో కంటే లోడ్​ క్యారీయింగ్​ కెపాసిటీపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

వేగంగా దూసుకుపోతుంది!
Luna Electric Bike Speed : సాధారణంగా ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాల వేగం కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఈ ఎలక్ట్రిక్​ లూనా గంటకు 50 కి.మీ నుంచి 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని కెనెటిక్​ గ్రీన్​ సంస్థ తెలిపింది. ఎఫ్​ఎఎమ్​ఈ-2 సబ్సిడీకి కూడా ఇది ఎలిజిబుల్​ అవుతుందని సమాచారం.

పవర్​ఫుల్​ బ్యాటరీలు
Luna Electric Bike Price : ఈ ఎలక్ట్రిక్​ లూనాలో స్వాపబుల్​ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఫాస్ట్​ ఛార్జింగ్​ బ్యాటరీలు కంటే ప్రభావవంతంగా పనిచేస్తాయని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో అధికంగా, ఎక్కువగా వస్తువులను తీసుకువెళ్లాలనే చిరు వ్యాపారులకు ఈ ఎలక్ట్రిక్​ లూనా బాగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దీనిలో టాప్​ బాక్స్​, క్యారియర్లు, ఐస్​ బాక్స్​లు ఏర్పాటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ-లూనాను 2023 జూలై నాటికి రూ.80,000 నుంచి రూ.90,000​ ధరతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్​లో ఈ- బైక్స్​ హవా!
ప్రస్తుతం మార్కెట్​లో అనేక రకాల ఈ-బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బజాజ్ చేతక్​, ఓలా ఎస్​1, ఓలా ఎస్​1 ప్రో, సింపుల్​ ఒన్​, ఏథర్​ 450ఎక్స్, టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​, రివోల్ట్​ ఆర్​వీ400 బైక్​లు ఎక్కువగా అమ్మడవుతున్నాయి. అయితే వాటి ధర కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. సామాన్యులకు అది కొంచెం భారమే. కానీ కాలుష్య రహిత వాహనాలను వినియోగించాలనుకునే వారికి ఇవి కచ్చితంగా మంచి ఎంపికే!.

Last Updated : Jun 1, 2023, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details