తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్రెషర్స్​కే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, సగానికిపైగా సంస్థల ఆలోచన అదే - ఫ్రెషర్స్​కు ఉద్యోగ అవకాశాలు

దేశంలో 59 శాతానికి పైగా సంస్థలు తాజా ఉత్తీర్ణులను నియమించుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ఏడాది వ్యవధిలో చూస్తే ఇది 42% వృద్ధి చెందిందని  వివరించింది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్ల నియామకాలు దేశీయంగా మెరుగవుతున్నాయని పేర్కొంది.

Hiring Of Freshers In India Becomes More Promising
Hiring Of Freshers In India Becomes More Promising

By

Published : Aug 28, 2022, 8:19 AM IST

Jobs for freshers : ఈ ఏడాది ద్వితీయార్ధంలో తాజా ఉత్తీర్ణులను నియమించుకునేందుకే దేశంలో 59 శాతానికి పైగా సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ నివేదిక వెల్లడించింది. తొలి అర్ధ భాగంతో పోలిస్తే ఇది 12 శాతం అధికమని తెలిపింది. ఏడాది వ్యవధిలో చూస్తే ఇది 42% వృద్ధి చెందిందని వివరించింది. ప్రారంభ స్థాయి ఉద్యోగాలు, ఫ్రెషర్ల నియామకాలు దేశీయంగా మెరుగవుతున్నాయని 'కెరీర్‌ అవుట్‌లుక్‌' పేరుతో రూపొందించిన నివేదికలో పేర్కొంది. ఫ్రెషర్లను ఎక్కువగా నియమించుకోవడం ద్వారా, మొత్తం ఉద్యోగుల్లో వారి వాటా పెంచుకోవాలనుకుంటున్నట్లు ఎక్కువ కంపెనీలు తెలిపాయని టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ శాంతను రూజ్‌ వెల్లడించారు. కంపెనీలు, విద్యాసంస్థలు, పరిశ్రమ మధ్య ఒప్పందాలతో అప్రెంటిస్‌షిప్‌ ఎంబెడెడ్‌ డిగ్రీలు రూపొందించి, అభ్యర్థుల్లో నైపుణ్యాలు పెంచడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 14 ప్రాంతాల్లోని 18 రంగాలకు చెందిన 865 కంపెనీల నిర్వాహకుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదికను తయారు చేసినట్లు టీమ్‌లీజ్‌ ఎడ్‌టెక్‌ తెలిపింది.

ఈ రంగాల్లో అధికం
సమాచార-సాంకేతిక, ఇ-కామర్స్‌-టెక్నాలజీ అంకురాలు, టెలికమ్యూనికేషన్ల విభాగాల్లో వరుసగా 65%, 48%, 47% సంస్థలు ఫ్రెషర్లను నియమించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఐటీ రంగమే 1 లక్ష మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ రంగంలో 101.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీలు తెలిపాయి. 2022-23లో ఐటీ ఎగుమతులు 8-10% పెరుగుతాయని అంచనా. మరోవైపు టెలికాం కంపెనీలు కూడా రూ.3,345 కోట్లు పెట్టుబడులతో దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నెలకొల్పనున్నాయని నివేదిక పేర్కొంది.

నగరాల వారీగా..
బెంగళూరులో అత్యధికంగా 68% సంస్థలు తాజా ఉత్తీర్ణులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీని తర్వాత ముంబయి (50 శాతం), దిల్లీ (45 శాతం) ఉన్నాయి. 2022 జనవరి-జూన్‌ మధ్య చూస్తే బెంగళూరులో 59 శాతం, ముంబయిలో 43 శాతం, దిల్లీలో 39 శాతం సంస్థలు ఫ్రెషర్లను నియమించుకున్నాయి.

ఇవీ చదవండి:అందరి కళ్లూ నోయిడా జంట భవనాలపైనే, ఏం జరుగుతుందో

సోనాలీ ఫోగాట్​కు ఇచ్చిన డ్రగ్స్​ అవే, లైవ్ సీసీటీవీ ఫుటేజీ లభ్యం

ABOUT THE AUTHOR

...view details