తెలంగాణ

telangana

ETV Bharat / business

అమ్మకాల జోరుతో సూచీల రివర్స్ గేర్​ - stock market news today

బ్యాంకింగ్, వాహన రంగాల షేర్ల పతనంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 433, నిఫ్టీ 122 పాయింట్లు నష్టపోయాయి.

stock market
స్టాక్ మార్కెట్

By

Published : Aug 14, 2020, 3:40 PM IST

వారాంతంలో లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి సెషన్​లో భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఫార్మా, లోహ రంగాల్లో అమ్మకాలు పెరగగా.. బ్యాంకింగ్, వాహన రంగాల షేర్లు 2 శాతం మేర పడిపోయాయి.

బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్ 433 పాయింట్ల నష్టంతో 37,877కి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 11,178 పాయింట్ల వద్ద స్థిరపడింది.

లాభ నష్టాల్లో..

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ, మారుతి, బజాజ్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details