తెలంగాణ

telangana

ETV Bharat / business

అనిశ్చితిలో చమురు మార్కెట్లు - ఆరంభ లాభాలు ఆవిరి - wti crude price

అంతర్జాతీయ చమురు మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా బుధవారం ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. బ్రెంట్​ క్రూడ్ ధర 12 శాతం పతనం కాగా.. డబ్ల్యూటీఐ 5 శాతం క్షీణించింది.

OIL-PRICES
చమురు ధరలు

By

Published : Apr 22, 2020, 10:02 AM IST

Updated : Apr 22, 2020, 12:47 PM IST

అంతర్జాతీయ చమురు మార్కెట్లు బుధవారమూ అనిశ్చితిలోనే కొనసాగుతున్నాయి. తొలుత లాభపడిన బ్రెంట్​​ చమురు.. తిరిగి 12.31 శాతం పడిపోయింది. ఆరంభ లాభాలు ఆవిరై బ్యారెల్​ ధర 16.98 డాలర్ల దిగువకు చేరింది.

వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్​ కూడా ఆరంభంలో 20 శాతం లాభపడినా.. మధ్యాహ్నానికి 5 శాతం మేర పడిపోయి బ్యారెల్ ధర 11 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఆ ప్రభావం తాత్కాలికమే..

తక్కువ ధర వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపటం మార్కెట్లకు కలిసివచ్చింది. చమురు మార్కెట్ పరిస్థితిపై ఒపెక్​ దేశాలు, వాటి భాగస్వామ్య పక్షాలు టెలీకాన్ఫరెన్స్​ ద్వారా చర్చించడమూ సానుకూల ప్రభావం చూపింది. అయితే ఈ చర్యలు తాత్కాలిక ధరల పెరుగుదలకే సహకరించాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గటం, రష్యా- ఒపెక్ దేశాల మధ్య చమురు యుద్ధం కారణంగా క్రూడ్​ ధరలు రికార్డు స్థాయిలో పతనమయ్యాయి. డబ్ల్యూటీఐ చమురు ధర -40 డాలర్లకు పడిపోగా.. బ్రెంట్ ధరలు 12 శాతం పడిపోయి 18 ఏళ్ల కనిష్ఠాన్ని నమోదు చేశాయి.

ఇదీ చూడండి:చమురు ధరలు తగ్గినా మనకు మంట తప్పదా!

Last Updated : Apr 22, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details