ఆర్బీఐ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 328 పాయింట్ల లాభంతో 40,511 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 83 పాయింట్లు వృద్ధి చెంది 11,917వద్ద ట్రేడవుతోంది.
11:37 October 09

09:57 October 09
ఆర్బీఐ ప్రకటనపైనే...
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలై అలానే కొనసాగుతున్నాయి.నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు ప్రకటించనుండటం వల్ల మార్కెట్లు మందకొడిగా ఉన్నాయి.
లక్ష్మీవిలాస్ బ్యాంక్, సోలార్ ఇండస్ట్రీస్, మహీంద్రా లాజిస్టిక్స్, హిందాల్కో, జేకే సిమెంట్ షేర్లు లాభపడుతుండగా.. క్రిసిల్, రిలయన్స్ పవర్, జస్ట్‌డయల్, డాక్టర్ లాల్‌పత్ ల్యాబ్స్, ఫ్యూచర్ రీటైల్ నష్టాల్లో ఉన్నాయి.
నేడు రాష్ట్రీయ కెమికల్స్ వంటి ఐదు కంపెనీలు ఫలితాలు ప్రకటించనున్నాయి.
09:05 October 09
వారాంతంలో శుభారంభం- సెన్సెక్స్ 100 ప్లస్
వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 40,286 వద్ద కొనసాగుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 32 పాయింట్లు వృద్ధి చెంది 11,867 వద్ద ట్రేడవుతోంది.