తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ లాభాల్లో మార్కెట్లు... 39,500పైకి సెన్సెక్స్

stock markets
లాభాల్లో సూచీలు

By

Published : Aug 28, 2020, 9:58 AM IST

Updated : Aug 28, 2020, 5:41 PM IST

15:42 August 28

ఇండస్​ఇండ్ బ్యాంక్ జోరు..

వారంలో చివరి రోజును స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు పెరిగి 39,647 వద్దకు చేరింది. నిఫ్టీ 88 పాయింట్ల లాభంతో 11,648 వద్ద స్థిరపడింది.

ఆర్థిక, హెవీ వెయిట్ షేర్ల దన్ను లాభాలకు ప్రధాన కారణం. అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు కలిసొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

  • శుక్రవారం సెషన్​లో ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు అత్యధిక లాభాలను నమోదు చేశాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, సన్​ఫార్మా,  కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రధానంగా లాభపడ్డాయి.
  • పవర్​గ్రిడ్, ఇన్ఫోసిస్, హెచ్​యూఎల్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, ఎం&ఎం షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

12:04 August 28

బుల్ జోరు..

స్టాక్ మార్కెట్లలో మిడ్​ సెషన్​ తర్వాత బుల్​ దూకుడు కొనసాగుతోంది. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు పుంజుకుని 39,513 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా లాభంతో 11,662 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు, బ్యాంకింగ్, హెవీ వెయిట్​ షేర్ల దన్ను లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • పవర్​గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఇన్ఫోసిస్, ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:32 August 28

భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 354+

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో పాటు ఆర్థిక రంగ​ షేర్ల దన్నుతో దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ - సెన్సెక్స్​ 251 పాయింట్ల లాభంతో 39,365 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ - నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 11,630 వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

ఇండస్​ఇండ్​ బ్యాంకు, యాక్సిస్​ బ్యాంకు, రిలయన్స్​, ఎస్​బీఐ, జీ ఎంటర్​టైన్​మెంట్​, భారతీ ఇన్​ఫ్రాటెల్​, లార్సెన్​ సంస్థలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాటా మోటర్స్​, జేఎస్​డబ్ల్యూ, ఏషియన్​ పేయింట్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇన్ఫోసిస్​ నష్టాల్లోకి వెళ్లాయి.

Last Updated : Aug 28, 2020, 5:41 PM IST

ABOUT THE AUTHOR

...view details