తెలంగాణ

telangana

ETV Bharat / business

లోటు వర్షపాతం అంచనాలతో ర్యాలీకి తెర! - sensex

వరుసగా నాలుగు రోజుల పాటు జోరుగా సాగిన స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్ల నష్టంతో 38, 877 పాయింట్లకు చేరింది. 70 పాయింట్ల నష్టంతో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 11,644 వద్ద ముగిసింది. లోటు వర్షపాతం నమోదుపై స్కైమెట్ నివేదిక, వృద్ధిరేటు మందగించటం వల్ల నష్టాల్లోకి వెళ్లాయి మార్కెట్లు.

లోటు వర్షపాతం అంచనాలతో ర్యాలీకి తెర!

By

Published : Apr 3, 2019, 6:02 PM IST

వరుసగా నాలుగు రోజులపాటు జోరు కొనసాగించిన స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్లు కోల్పోయి 38,877 పాయింట్లకు చేరింది. దేశీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో 11,644గా ముగిసింది.

లోటు వర్షపాతం నమోదుపై స్కైమెట్ నివేదిక, వృద్ధిరేటు మందగించటం వల్ల నష్టాల్లోకి వెళ్లాయి మార్కెట్లు. ఆర్​బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశాలకు చివరిరోజు గురువారం. వడ్డీరేట్లు 25పాయింట్లు తగ్గిస్తుందనే ఆశలతో మార్కెట్లు నాలుగు రోజులుగా ర్యాలీ కొనసాగించిన స్కైమెట్ నివేదికతో అడ్డుకట్టపడింది.

నష్టపోయిన షేర్లు...

ఎస్​బీఐ, యస్​ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, ఎల్​ అండ్ టీ, సన్​ ఫార్మా, ఓఎన్​జీసీ, వేదాంత, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

లాభపడిన షేర్లు...

మారుతీ, హెచ్​సీఎల్, హెచ్​డీఎఫ్​సీ, టాటాస్టీల్, పవర్​గ్రిడ్, హీరో మోటో కార్ప్​ షేర్లు లాభాలతో ముగిశాయి.

బలపడిన రూపాయి

డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ 30 పైసలు బలపడి 68.44 వద్ద ముగిసింది.

ఇదీ చూడండి:భారత్​ ఆర్థిక వృద్ధి ఆశాజనకం: ఏడీబీ

ABOUT THE AUTHOR

...view details