చైనా బలమైన ఆర్థిక వృద్ధి నమోదు చేసినా... అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంపై నెలకొన్న ఆందోళనల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఊగిసలాట ధోరణిలో ఉదయం ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు.. సమయం గడిచేకొద్దీ నష్టాల్లోకి జారుకొన్నాయి. సోమవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 470 పాయింట్లు కోల్పోయి 48,564 వద్దకు చేరింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 152 పాయింట్లు తగ్గి 14,281 వద్ద స్థిరపడింది. వినియోగదారు వస్తువులు, ఇంధన రంగాలు తప్ప మిగిలిన సూచీలు మొత్తం నష్టాలు మూటకట్టుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,122పాయింట్ల అత్యధిక స్థాయి, 48,403పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,459పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,222పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.