తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతా ప్రశాంతం.. మార్కెట్లకు సానుకూలం - nse

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 94 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ ఆరంభట్రేడింగ్​లోనే 11 వేల 850 మార్కును అధిగమించింది.

లాభాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : Jun 27, 2019, 9:56 AM IST

అమెరికా-చైనా వాణిజ్య వివాదానికి తెరపడుతుందన్న ఆశల నడుమ దేశీయ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​​ 94 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 39 వేల 687 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రారంభ సెషన్​లో 11 వేల 850 మార్కును దాటింది. ప్రస్తుతం 28 పాయింట్ల స్వల్ప లాభంతో 11 వేల 876 వద్ద ఉంది.

ఆటో, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎఫ్​ఎంసీజీ, ఇన్​ఫ్రా రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.

లాభనష్టాల్లోనివివే...

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఓఎన్​జీసీ, టాటా మోటార్స్​, లార్సెన్​, యాక్సిస్​ బ్యాంక్​, జీ ఎంటర్​టైన్​మెంట్స్​, భారతీ ఎయిర్​టెల్​, ఎన్టీపీసీ లాభాలతో సెషన్​ను ప్రారంభించాయి.

బ్రిక్​వర్క్​ రేటింగ్స్​ తగ్గించినందున కాక్స్​ అండ్​ కింగ్స్​ షేర్లు ఆరంభట్రేడింగ్​లోనే 10 శాతం పడిపోయాయి. 52 వారాల కనిష్ఠాన్ని చేరాయి.

సన్​ ఫార్మా, కోల్​ ఇండియా, పవర్​గ్రిడ్​ కార్పొరేషన్​, బజాజ్​ ఆటో, హెచ్​సీఎల్​ టెక్​, ఐఓసీ, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ నష్టపోయిన కంపెనీల జాబితాలో ఉన్నాయి.

ఆరంభట్రేడింగ్​లో రూపాయి 11 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 69.26 వద్ద ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details