తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు ఆర్థిక సర్వే జోష్- 58వేల పాయింట్ల ఎగువకు సెన్సెక్స్ - స్టాక్ మార్కెట్లు

STOCK MARKETS live updates
STOCK MARKETS live updates

By

Published : Jan 31, 2022, 9:22 AM IST

Updated : Jan 31, 2022, 3:37 PM IST

15:36 January 31

Stock market news: స్టాక్ మార్కెట్లు ఈ వారం తొలిరోజును భారీ లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్​ 814 పాయింట్లు వృద్ధి చెంది 58,014కి చేరింది. నిఫ్టీ 238 పాయింట్లు మెరుగుపడి 17,339 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలకు తోడు కేంద్ర బడ్జెట్​కు ముందు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో 2021-22 ఏడాదికి జీడీపీ వృద్ధి 9.2శాతంగా ఉంటుందనే అంచనాలు, ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయని తెలపడం వంటి అంశాలు మదుపర్లను కొనుగోళ్లవైపు మళ్లించాయి. దీంతో సెన్సెక్స్​, నిఫ్టీ భారీ లాభాలు గడించాయి.

ఇంట్రాడే..

ఉదయం 58వేల 103 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ తొలుష నష్టాలను చూసింది. ఆ త్వారాత వెంటనే లాభాల బాట పట్టి 600కు పాయింట్లు వృద్ధి చెందింది. మిడ్​ సెషన్​ తర్వాత మరింత జోరు ప్రదర్శించింది. ఒకానొక దశలో దాదాపు 1000 పాయింట్లుకుపైగా పెరిగింది. ఆ త్వర్వాత కాస్త తగ్గింది. మొత్తంగా సెషన్ ముగిసే సరికి సెన్సెక్స్ 814 పాయింట్లు మెరుగుపడింది. నిఫ్టీ కూడా ఇదే పరిస్థితుల్లో 238 పాయింట్లు పెరిగింది.

లాభనష్టాలోనివి ఇవే..

టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు 4శాతానికిపైగా వృద్ధి చెందగా.. బీపీసీఎల్, విప్రో, ఇన్ఫోసిస్​ షేర్లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

13:07 January 31

స్టాక్​ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్ల వృద్ధితో 58 వేల 195 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 290 పాయింట్లు పెరిగి 17 వేల 390 వద్ద ట్రేడవుతోంది.

11:56 January 31

సోమవారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 824 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ప్రస్తుతం 58 వేల పాయింట్ల ఎగువన కదలాడుతోంది.

సెన్సెక్స్ షేర్లలో టెక్ మహీంద్ర అత్యధికంగా 4.65 శాతం లాభంతో ట్రేడవుతోంది. డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, రిలయన్స్ షేర్లు రాణిస్తున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ మాత్రం 3 శాతానికి పైగా నష్టపోయింది. కోటక్ మహీంద్ర సైతం నష్టాల్లోనే ఉంది.

మరోవైపు, నిఫ్టీ లాభాల్లో పయనిస్తోంది. 246 పాయింట్లు ఎగబాకి.. 17,348 వద్ద కొనసాగుతోంది.

09:34 January 31

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 750 పాయింట్లు వృద్ధి చెందింది. 58 వేల మార్కును అందుకునే దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 57,950 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

అటు... నిఫ్టీ సైతం లాభాల్లోనే ఉంది. 228 పాయింట్లు ఎగబాకింది. ప్రస్తుతం 17,330 వద్ద కదలాడుతోంది.

09:16 January 31

స్టాక్ మార్కెట్లు లైవ్

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడం, ఆసియా మార్కెట్లు రాణిస్తుండటం వల్ల.. దేశీయ మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 660 పాయింట్లకు పైగా వృద్ధి చెందింది. 57,870 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 షేర్లలో దాదాపు అన్నీ లాభాల్లోనే ఉన్నాయి.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 202 పాయింట్లకు పైగా లాభపడింది. ప్రస్తుతం 17,304 వద్ద కదలాడుతోంది.

Last Updated : Jan 31, 2022, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details